ఎమ్మెల్యేల ఎరకేసులో సీబీఐ, ఈడీ ఎంట్రీ కేసీఆర్ ఊహించలేకపోయారా? వాట్ నెక్స్ట్.. సర్వత్రా ఉత్కంఠ!!

తెలంగాణ సీఎం కేసీఆర్ ఊహించని పరిణామాలు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో చోటుచేసుకుంటున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ పై సంచలన ఆరోపణలు చేసి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి బీజేపీ కుట్ర చేసిందని సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసును ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని చెప్పిన ఆయన, ఈ కేసులో ఎంత పెద్దవారు ఉన్నా సరే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. సిట్ ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో బిజెపి నాయకులను, బిజెపి అధిష్టానాన్ని ఇరకాటంలో పెట్టాలని భావించిన కేసీఆర్ కు షాక్ ఇస్తూ తాజాగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణలో భాగంగా సిబిఐ విచారణకు అనుమతినిచ్చింది తెలంగాణ హైకోర్టు. మరోపక్క ఈ కేసును ఈడీ కూడా విచారిస్తుంది. ఇక ఇది కేసీఆర్ కు ఊహించని పరిణామమని అభిప్రాయపడుతున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్ అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్ అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్ అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, ఆడియో రికార్డింగ్ లు వీడియో టేపులు ఉన్నాయని, చర్యలు తీసుకోవడానికి కావాల్సిన అన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొన్న తెలంగాణ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేయడానికి రంగంలోకి దిగినప్పటికీ అనుకున్న ఫలితాలను సాధించలేక పోయింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా నందకుమార్, రామచంద్ర భారతి, సింహయాజీ స్వాములను అరెస్ట్ చేసి, వారిని విచారణ జరిపి, వారి విచారణ ఆధారంగా ఈ కేసులో ప్రమేయం ఉన్న బీజేపీ కీలక నాయకుడు బీఎల్ సంతోష్ తో పాటు తుషార్, జగ్గు స్వామి లను అరెస్టు చేసి విచారించాలని సిట్ అధికారులు శతవిధాల ప్రయత్నం చేశారు. కానీ కోర్టు ఆదేశాలతో ఎక్కడికక్కడ వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సైలెంట్ గా ఎంటర్ అయిన ఈడీ

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సైలెంట్ గా ఎంటర్ అయిన ఈడీ


ఇక ఊహించని విధంగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో వందకోట్ల ముడుపుల చెల్లింపులకు సంబంధించి మనీ లాండరింగ్ వ్యవహారం చోటుచేసుకుందని దీన్ని దర్యాప్తు చెయ్యటానికి రంగంలోకి దిగింది ఈడీ. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. రెండు రోజులపాటు పైలట్ రోహిత్ రెడ్డి విచారించిన అధికారులు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని ప్రశ్నించారు. దీంతో ఈ కేసులో ఈడీ కూడా రంగంలోకి దిగిందని బీఆర్ఎస్ నేతలకు అర్థమైంది. కేంద్రంలోని బీజేపీ ఈడిని రంగంలోకి దింపి ఎమ్మెల్యేలు కొనుగోలు కేసును సైడ్ ట్రాక్ పట్టించే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ నేతల నుండి విమర్శలు వెల్లువగా మారాయి. ఇక ఏకంగా పైలెట్ రోహిత్ రెడ్డి ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేయాలని బిజెపి ప్రయత్నం చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు.

 కోర్టుల చుట్టూ తిరుగుతూ సెల్ఫ్ డిఫెన్స్ లో పడిన తెలంగాణా ప్రభుత్వం

కోర్టుల చుట్టూ తిరుగుతూ సెల్ఫ్ డిఫెన్స్ లో పడిన తెలంగాణా ప్రభుత్వం

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఒక ప్రీ ప్లాన్డ్ ట్రాప్ అని, ఈ ఈ వ్యవహారంలో నేరుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని, ఆధారాలు నేరుగా సీఎం కేసీఆర్ చేతికి ఎలా వెళ్లాయని.. అందుకే ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేయాలని నిందితులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, తాజాగా విచారించిన కోర్టు ఈ కేసును సీబీఐ విచారణ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి, గులాబీ అధినేతకు ఊహించని మరో షాక్ తగిలినట్టైంది. ఇప్పుడు ఈ కేసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ చేతి నుండి చేజారి పోతూ ఉండడంతో కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రభుత్వానికి వచ్చింది.

ఈ పరిణామాలను కేసీఆర్ అంచనా వెయ్యలేకపోయారా? వాట్ నెక్స్ట్

ఈ పరిణామాలను కేసీఆర్ అంచనా వెయ్యలేకపోయారా? వాట్ నెక్స్ట్


ఈ కేసుతో గట్టిగా బిజెపి నేతలకు ఉచ్చు బిగిస్తున్నాం అనుకున్న కేసీఆర్, ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ లో పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఈ పరిణామాలను కేసీఆర్ ముందుగా అంచనా వేయలేకపోయారు అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మొదటి బీఆర్ఎస్ నాయకులు ఎంత హడావిడి చేస్తున్న సైలెంట్ గా ఉన్న బిజెపి, ఆ తర్వాత నిదానంగా సిబిఐని, ఈడీని ఎంటర్ చేసి టిఆర్ఎస్ నాయకులపై ఒత్తిడి పెంచే పనిలో పడింది. ఇక తాజా పరిణామాలతో ఎమ్మెల్యేలకు కొనుగోలు కేసులో సీఎం కేసీఆర్ ఏం చేయబోతున్నారు అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+