బ్యూటీషియన్ శిరీష కేసులో రాజీవ్, శ్రవణ్‌లకు చుక్కెదురు
బ్యూటీషియన్ శిరీష కేసులో నిందితులు రాజీవ్, శ్రవణ్‌లకు న్యాయస్థానంలో చుక్కెదురయింది. వారి బెయిల్ పిటిషన్‌ను కోర్టు గురువారం కొట్టివేసింది.
హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష కేసులో నిందితులు రాజీవ్, శ్రవణ్‌లకు న్యాయస్థానంలో చుక్కెదురయింది. వారి బెయిల్ పిటిషన్‌ను కోర్టు గురువారం కొట్టివేసింది.
నెల రోజుల క్రితం శిరీష మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెప్పారు. అత్యాచారం చేసి, చంపేశారని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

శిరీష మృతి పై కుటుంబ సభ్యులు లేవనెత్తుతున్న అనుమానాలు ఇంకా వీడలేదు. ఫోరెన్సిక్ నివేదికలోను శిరీషపై అత్యాచారం జరగలేదని తేలింది. కాని కుటుంబ సభ్యులు మాత్రం అత్యాచారం జరిపి, హత్య చేశారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications