గజల్ శ్రీనివాస్‌కు మరో 14రోజుల రిమాండ్: పరారీలోనే పార్వతి
హైదరాబాద్: ఆలయవాణి రేడియోలో పనిచేస్తోన్న యువతిని లైంగిక వేధించిన కేసులో గాయకుడు, రచయిత గజల్ శ్రీనివాస్‌కు నాంపల్లి కోర్టు మరో 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మరోవైపు గజల్ శ్రీనివాస్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ జనవరి 18న విచారణకు రానుంది.
చంచల్‌గూడ జైలులో ఉన్న గజల్ శ్రీనివాస్ జ్యుడీషియల్ కస్టడీ శుక్రవారంతో ముగియడంతో ఆయనను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా, ఆయనకు జనవరి 25 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.

కాగా, కోర్టు వద్ద మీడియాతో మాట్లాడేందుకు గజల్ శ్రీనివాస్ నిరాకరించారు. కాగా, ఈ కేసులో ఏ2 ముద్దాయిగా ఉన్న పార్వతి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె కూడా ముందస్తు బెయిలు కోసం పిటిషన్ వేసింది.












Click it and Unblock the Notifications