ఆఫ్రికా స్త్రీ హత్య: కస్టడీకి రూపేష్, సానియాకు డీఎన్ఏ పరీక్షలు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: భార్య సింథియాను హత్య చేసిన రూపేష్‌‌ను పోలీసులు మూడు రోజుల కస్టడీకి తీసుకోనున్నారు. రూపేష్‌ను తమ కస్టడీకి అప్పగించాలన్న పోలీసుల విజ్ఞప్తిని రాజేంద్రనగర్ న్యాయస్థానం అంగీకరించింది. కస్టడీలో రూపేష్ నుంచి సింథియా హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలను పోలీసులు రాబట్టనున్నారు.

మరోవైపు, సింథియా - రూపేష్‌ల కూతురు సానియాకు డీఎన్ఐ పరీక్షలు నిర్వహించేందుకు న్యాయస్థానం అనుమతి తెలిపింది. సానియాకు పరీక్షలు నిర్వహించిన అనంతరం ఈ నెల 15వ తేదీన ఆమెను తిరిగి న్యాయస్థానంలో హాజరుపరచాలని ఆదేశించింది.

Also Read: సింథియా హత్య: చైల్డ్ వెల్ఫేర్‌లోనే సానియా, డీఎన్ఏ పరీక్ష వాయిదా

Court order to DNA tests to Sania

కాగా, తల్లి సింథియాను తన తండ్రి రూపేష్ హత్య చేయడంతో వారి కూతురు సానియా ఎవరికి చెందాలనే విషయంపై రాజేంద్రనగర్ కోర్టు విచారణ జరుపుతోంది. ఆఫ్రికాలోని కాంగోకు చెందిన సింథియాను భర్త రూపేష్ అత్యంత కిరాతకంగా హత్య చేసి ముక్కలుగా నరికి తగులబెట్టిన విషయం తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rajendra Nagar Court order to DNA tests to Sania.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X