వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో తీసిన పోకిరికీ ఏడాది జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా కూడా ..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన వ్యక్తికి కూకట్ పల్లి 11వ ఎంఎం కోర్టు జైలుశిక్ష విధించింది. దీనిని తీవ్ర కేసుగా పరిగణిస్తూ 10 వేల జరిమానా కట్టాలని స్పష్టంచేసింది. ఈ తీర్పుపై ప్రజాసంఘాల నుంచి హర్షం వ్యక్తమవుతుంది. పోకిరి అవినాశ్‌కు తగిన శిక్ష పడిందని ప్రజాసంఘ నేతలు పేర్కొంటున్నారు.

వీడియో తీసిన పోకిరి
హైదరాబాద్ చింతల్‌కు చెందిన మహిళ బాత్ రూంలో స్నానం చేసింది. అయితే 2014 ఏప్రిల్ 19న అవినాశ్ రెడ్డి అనే వ్యక్తి తన ఫోన్‌లో వీడియో తీశాడు. తర్వాత ఈ విషయం బయటపడింది. వెంటనే మహిళ బంధువులు అప్పట్లోనే బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అవినాశ్ .. నేరం చేసినట్టు విచారణలో రుజువైంది. ఈ కేసులో వాద, ప్రతివాదనలు ముగిశాయి. ఈ మేరకు ఇవా మేజిస్ట్రేట్ శ్రీదేవి తీర్పును వెలువరించారు.

court verdict about julai for one year jail

నిందితుడు అవినాశ్ రెడ్డికి ఏడాది జైలుశిక్ష విధించారు. దీంతోపాటు రూ.10 వేల జరిమానా కూడా కట్టాలని తీర్పులో స్పష్టంచేశారు మేజిస్ట్రేట్. ఈ కేసు విచారణ ఆలస్యమైనా .. నిందితుడికి శిక్ష విధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. పోకిరి అవినాశ్ ఏడాది జైలుశిక్ష విధించడాన్ని స్వాగతిస్తున్నారు.

మరి మిగతా కేసులు ?
అవినాశ్‌తోపాటు మిగతా కేసుల విచారణ పూర్తిచేసి .. శిక్షలు విధించాలనే మేధావులు కోరుతున్నారు. లేదంటే సమాజంలో మరింత వారు రెచ్చిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఈ కేసుల కోసం ఫాస్ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే కేసు విచారణ మరింత జాప్యం జరిగే అవకాశం ఉందిన ఆందోళన వ్యకతం చేశారు.

English summary
While the woman was bathing, the 11th MM was sentenced to a person who had taken the video. It has been found to be a serious case and ordered to pay 10 thousand fine. This judgment expresses a feeling of frustration from the public organizations. People's leaders have claimed that guy has been given sufficient punishment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X