వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో కరోనా: ఒకేరోజు భారీగా డిశ్చార్జిలు.. కొత్తగా 1430 పాజిటివ్ కేసులు

|
Google Oneindia TeluguNews

కొవిడ్-19 కేసుల రికవరీల్లో జాతీయ సగటు కంటే తెలంగాణ మెరుగైన స్థితిలో ఉండటంతో మంగళవారం ఒక్కరోజే భారీ ఎత్తున 2062 మంది వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే వైరస్ వ్యాప్తి వేగంగా ఉండటంతో కొత్త కేసులు కూడా అదే స్థాయిలో నమోదయ్యాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించిన లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 1430 కేసులు వచ్చాయి.

కరోనాపై కేసీఆర్ సమీక్ష: హైకోర్టు, మీడియా తీరుపై అభ్యంతరం.. స్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నారంటూ..కరోనాపై కేసీఆర్ సమీక్ష: హైకోర్టు, మీడియా తీరుపై అభ్యంతరం.. స్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నారంటూ..

తాజా కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం 47,705 మంది ఇన్ఫెక్షన్ కు గురికాగా, అందులో 76 శాతం రికవరీ రేటుతో ఇప్పటికే 36,385 మంది డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 10,891గా ఉంది. ఇక మంగళవారం మరో 7 మంది కరోనాకు బలి కాగా, మొత్తం మృతుల సంఖ్య 429కి పెరిగింది. కేసుల సంఖ్యతో పోల్చినప్పుడు తెలంగాణలో మరణాల రేటు 1శాతం లోపే(0.89శాతం)గా ఉందని బులిటెన్ లో పేర్కొన్నారు.

covid-19: 1430 new cases, 7 deaths in last 24 hours in telangana, recoveries at high

మంగళవారం బయటపడ్డ కొత్త కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 703 నమోదయ్యాయి. 117 కొత్త కేసులతో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో 105, సంగారెడ్డి జిల్లా 50 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జిల్లా ఉంది. ఇక్కడ 50 కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 48, నల్గొండ 45, వరంగల్ అర్బన్ 34, మహబూబాబాద్ 27, మెదక్ జిల్లాలో 26 కొత్త కేసులు వచ్చాయి.

Recommended Video

Tollywood Director Wise Words On Covid 19 | Oneindia Telugu

రాష్ట్రంలో టెస్టుల సంఖ్యను పెంచడం కూడా కేసుల పెరుగుదలకు కారణమైంది. మంళవారం ఒక్కరోజే 16,855 శాంపిళ్లను టెస్టు చేశామని, దీంతో మొత్తం ఇప్పటి వరకూ తెలంగాణలో చేసిన కరోనా టెస్టుల సంఖ్య 2,93,077కు చేరిందని బులిటెన్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 39 చోట్ల కరోనా పరీక్షలు జరుపుతున్నామని, వివిధ కొవిడ్ ఆస్పత్రుల్లో కావాల్సినన్ని బెడ్లు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.

English summary
record number of 2062 patients cured and discharged in a single day in telangana. according to state health department announcement 1430 new cases and seven deaths reported on tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X