తెలంగాణలో 6551 కరోనా కేసులు: జీహెచ్ఎంసీలో అత్యధికం, 43 మంది మరణం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో (ఆదివారం రాత్రి 8 గంటల వరకు) 73,275 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 6551 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఆదివారం 43 మంది మరణించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.
Recommended Video
కరోనా బారి నుంచి నిన్న 3804 మంది కరోనా నుంచి సురక్షితంగా బయటపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 65,597కి చేరింది. కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో 1418 కేసులు నమోదయ్యాయి.
తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,01,783కు చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2042 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు.

జీహెచ్ఎంసీ తర్వాత అత్యధికంగా మేడ్చల్ మల్కాజ్ గిరిలో 554, రంగారెడ్డిలో 482, నిజామాబాద్‌లో 388, సంగారెడ్డిలో 368, వరంగల్ అర్బన్ లో 329, జగిత్యాలలో 276, కరీంనగర్లో 222, మహబూబ్ నగర్లో 226, సిద్దిపేటలో 268 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఇది ఇలా ఉండగా, తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కరోనా మొదటి వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్ పూర్తి భిన్నంగా ఉందన్నారు. ఇంట్లో ఒక్కరికి వైరస్ సోకితే మిగా వారందరికీ వేగంగా వ్యాపిస్తోందన్నారు. అందుకే ఇంట్లో ఉండే అవకాశం లేని వారందరి కోసం ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వైరస్ కారణంగా ప్రాణాలు పోకుండా చూడటమే మనందరి లక్ష్యమని మంత్రి చెప్పారు. కరోనా వచ్చి హోం ఐసోలేషన్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆశా వర్కర్లు రోజుకు రెండు సార్లు ఆక్సిజన్ లెవల్స్, జ్వరం పరీక్ష చేయాలని ఆదేశించారు. ఈ విధంగా చేసినప్పుడే ప్రాణాలు పోకుండా కాపాడగలుగుతామని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
-
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
ఆ జిల్లాల్లో 40డిగ్రీల ఉష్ణోగ్రతలు.. ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చిన ఐఎండీ! -
హైదరాబాద్ కు మరో మణిహారం..దేశంలోనే రెండో నెట్‌ఫ్లిక్స్ ఆఫీస్ ప్రారంభం.. ఎప్పుడంటే! -
"బీరు"తో పాటు బాటిల్ లోపలే స్టఫ్.. బిత్తరపోయిన మందుబాబు !! -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
విజయవాడలో పోలీసులపై గన్ తో కాల్పులు, వరంగల్ వ్యక్తి అరెస్ట్ -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి..












Click it and Unblock the Notifications