హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా -కొత్తగా 3,387 కేసులు, 25 మరణాలు -లాక్‌డౌన్ 2.0 మరింత కఠినంగా

|
Google Oneindia TeluguNews

చూడబోతే తెలంగాణలో లాక్ డౌన్ సత్ఫలితాన్నిచ్చినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో రోజువారీ కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయి. గడిచిన నాలుగైదు రోజులుగా కొత్త కేసులు తగ్గుతూ ఈ నెలలోనే కనిష్ట స్థాయికి చేరాయి. కొవిడ్ రోగులకు భరోసా కల్పిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. మరోవైపు వ్యాక్సిన్ల కోసం తెలంగాణ సర్కారు గ్లోబల్ టెండర్లకు సిద్ధమైంది. అదే క్రమంలో లాక్ డౌన్ 2.0ను మరింత కఠినతరం చేసింది. వివరాల్లోకి వెళితే..

బోర్లా పడ్డ రఘురామ -చంద్రబాబుకూ శిక్ష -డా.సుధాకర్ తీరన్న సాయిరెడ్డి -సుప్రీంకోర్టుకు చేరిన తెలంగాణ రిపోర్ట్బోర్లా పడ్డ రఘురామ -చంద్రబాబుకూ శిక్ష -డా.సుధాకర్ తీరన్న సాయిరెడ్డి -సుప్రీంకోర్టుకు చేరిన తెలంగాణ రిపోర్ట్

కొత్తగా 3837 కేసులు

కొత్తగా 3837 కేసులు

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం విడుదల చేసిన కొవిడ్ కేసుల బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 71,070శాంపిల్స్‌ పరీక్షించగా, 3837 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 5,40,603కి చేరింది. కొత్తగా వెలుగుచూసిన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 594 కొత్త కేసులు, రంగారెడ్డి జిల్లాలో 265, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 239, ఖమ్మం జిల్లాలో 227 చొప్పున నమోదయ్యాయి. ఇక,

మోదీ పరువు తీసిన గడ్కరీ -వ్యాక్సిన్ల కొరతపై సంచలనం -కేంద్రం ఏం చేస్తున్నదో తెలీదని వ్యాఖ్యమోదీ పరువు తీసిన గడ్కరీ -వ్యాక్సిన్ల కొరతపై సంచలనం -కేంద్రం ఏం చేస్తున్నదో తెలీదని వ్యాఖ్య

పెరిగిన రికవరీలు, తగ్గిన మరణాలు

పెరిగిన రికవరీలు, తగ్గిన మరణాలు


నిన్న ఒక్కరోజే తెలంగాణలో కొవిడ్ మహమ్మారి వల్ల 25మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 3037కు పెరిగింది. జాతీయ స్థాయిలో మరణాల రేటు 1.1శాతం కాగా, తెలంగాణలో అది 0.56శాతంగా ఉన్నట్లు బులిటెన్ లో పేర్కొన్నారు. ఇక నిన్న ఒక్కరోజే 4976 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం డిశ్చార్జీల సంఖ్య 4,90,620కి పెరిగింది. దేశంలో రికవరీ రేటు 86.2శాతం కాగా, తెలంగానలో అది 90.75శాతానికి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 46,946 యాక్టివ్ కేసులున్నాయి. ఇదిలా ఉంటే..

లాక్‌డౌన్ కఠినం.. వ్యాక్సిన్లకు టెండర్లు

లాక్‌డౌన్ కఠినం.. వ్యాక్సిన్లకు టెండర్లు


వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేలా టీకాల సేకరణ కోసం తెలంగాణ సర్కారు బుధవారం గ్లోబల్ షార్ట్ టెండర్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ టెండర్ల ద్వారా మొత్తం 1 కోటి డోసుల వ్యాక్సిన్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిని సందర్శించి రోగులకు భరోసా ఇచ్చారు. కొవిడ్ పరిస్థితిపై సమీక్ష చేశారు. లాక్ డౌన్ సత్ఫలితాలిస్తుండటంతో ఈనెల 22 నుంచి కొనసాగనున్న పొడగింపు లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని డీజీపీ మహేందర్‌ రెడ్డి అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీ, ఐజీలకు నిర్దేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ లో ఈ మేరకు డీజీపీ మాట్లాడుతూ 4గంటల సడలింపు సమయంలో జనం విపరీతంగా రోడ్లపైకి వస్తున్నందున మార్కెట్ల వద్ద రద్దీ లేకుండా చర్యలు తీసుకోవాలని, ఉదయం 10గంటల తర్వాత బయటకు వచ్చే వాళ్ల వాహనాలను స్వాధీనం చేసుకోవాలని అధికారులకు డీజీపీ సూచించారు.

English summary
Telangana has reported 3,837 new Covid infections and 25 fatalities on Wednesday taking the cumulative number of deaths to 3,037 and the total number of positive cases to 5,40,603.The number of active cases in Telangana, as on Wednesday evening, stood at 46,946. meanwhile telangana chief minister kcr visits covid dedicated gandhi hospital in hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X