తెలంగాణలో డేంజర్ బెల్స్: సినిమా థియేటర్ల మూసివేతకు సిఫార్సు -కొత్తగా 431 కేసులు -గ్రేటర్‌లో ఉధృతి
తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఒక్క మెడికల్ కాలేజీలు తప్ప మిగతా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు అన్నిటినీ మూసేసిన ప్రభుత్వం ఇంకా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది. తదుపరి చర్యల్లో భాగంగా మరిన్ని ఆంక్షలు విదించే అవకాశముంది. ఈలోపే..
ప్రధాని మోదీ సంచలనం: పాకిస్తాన్‌తో స్నేహం కోరుతూ ఇమ్రాన్ ఖాన్‌కు లేఖ -దేశ విభజనకు బీజం పడినరోజే

కొత్తగా 431 కేసులు, ఇద్దరు మృతి
తెలంగాణ ఆరోగ్య శాఖ బుధవారం విడుదల చేసిన బులిటెన్ లోని వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 70,280 కరోనా నిర్ధరణ పరీక్షలు చేపట్టగా కొత్తగా 431 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,04,298కి చేరింది. నిన్న ఒక్కరోజే కొవిడ్‌తో ఇద్దరు మృతిచెందారు. తద్వారా మొత్తం మరణాల సంఖ్య 1676కి చేరింది. కరోనా వ్యాధి నుంచి నిన్న 228 మంది కోలుకోగా, మొత్తం రికవరీల సంఖ్య 2,99,270కి చేరింది.

ఈ ఏడాదిలో అత్యధికంగా..
కొత్త కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు ఈ ఏడాదిలోనే అత్యధిక స్థాయికి చేరాయి. టీకాలు రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,352 ఉండగా.. వీరిలో 1,395 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 111 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 97,89,113గా ఉందని బులిటెన్ లో పేర్కొన్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్‌లో భాగంగా తెలంగాణలో ఇప్పటి వరకు 7,86,426 మందికి డోస్ 1.. 2,24,374 మందికి డోస్ 2 టీకా వేసినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే డోస్ 1ను 39,119 మందికి, డోస్ 2ను 3,611 మందికి వ్యాక్సిన్ వేసినట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే..
అబ్దుల్ కలాం పెద్ద జీహాది -పాక్‌కు అణు ఫార్ములా -ఉన్నత పదవుల్లోని ముస్లింలంతా అంతే: ఘజియాబాద్ పూజారి

సినిమా థియేటర్లనూ మూసేయాలి..
కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో సినిమా థియేటర్లను మూసి వేయాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ విషయంలో ఆలస్యం చేస్తే మరింత ముప్పు తప్పదని కూడా ఉన్నతాధికారులు ప్రభుత్వాన్ని హెచ్చరించినట్టు సమాచారం. ఒకవేళ మూసివేత వద్దని భావిస్తే, సీటింగ్ కెపాసిటీని అన్ లాక్ లో భాగంగా తీసుకున్న నిర్ణయాల మేరకు 50 శాతానికి తగ్గించాలని కూడా అధికారులు సూచించారు. నిజానికి..

ఇప్పటికే బడుల మూసివేత..
తెలంగాణలో ప్రస్తుతం కరోనా రెండో వేవ్ కొనసాగుతున్నదంటోన్న ఆరోగ్య శాఖ అధికారులు.. సినిమా థియేటర్ల విషయంలో జాగ్రత్త వహించాలని కరాకండిగా చెబుతున్నారు. వరుసగా కొత్త సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండటం, ప్రస్తుతం 90 శాతం వరకూ థియేటర్లు నిండిపోతుండటం, సినిమా హాల్స్ లో మాస్క్ లను ధరించకుండా, పక్కపక్కనే కూర్చోవడం, తలుపులు మూసివేసి, ఎయిర్ కండిషనింగ్ నడుస్తున్నదరిమిలా కేసుల పెరుగుదలను ఆపాలంటే మూసేవేతే సరైన పరిష్కారమని అంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజీలు తప్ప అన్ని రకాల విద్యా సంస్థలను బుధవారం నుంచి మూసేశారు.