వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాంధీలో పవర్ కట్..కొవిడ్ రోగుల ఇక్కట్లు - తెలంగాణలో వైరస్ సామూహిక వ్యాప్తి లేదన్న మంత్రి ఈటల

|
Google Oneindia TeluguNews

దేశంలోనే అతిపెద్ద కొవిడ్ డెడికేటెడ్ ఆస్పత్రుల్లో ఒకటైన హైదరాబాద్ గాంధీ దవాఖానకు కరెంటు కోతలు శాపంగా మారాయి. గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. గురువారం కూడా ఆస్పత్రిలో దాదాపు రెండు గంటలపాటు కరెంటు పోయింది. పేషెంట్లతోపాటు డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది ఇబ్బంది ఎదుర్కొన్నారు.

గాంధీలో కరెంటు కోతలపై వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. కోవిడ్ ఆసుపత్రుల్లో ఇలాంటి పరిస్థితి తలెత్తడమేంటని అధికారులపై ఫైరయ్యారు. గాంధీ సహా అన్ని ఆస్పత్రుల్లో ఎప్పటికప్పుడు జనరేటర్లు చెక్ చేసి పెట్టుకోవాలని, సరిపడా డీజిల్ నిల్వ ఉంచుకోవాలని ఆదేశించారు. ఒకవేళ ప్రభుత్వం సరఫరా చేసిన జనరేటర్లు సరిపోకపోతే, ప్రైవేట్ జనరేటర్లను వాడుకుని, బిల్లులు పెట్టాలని సూచించారు.

షాకింగ్: తెలంగాణలో కరోనా లోకల్ వ్యాప్తి.. రాబోయే నెల రోజులు డేంజరన్న ఆరోగ్య శాఖ..షాకింగ్: తెలంగాణలో కరోనా లోకల్ వ్యాప్తి.. రాబోయే నెల రోజులు డేంజరన్న ఆరోగ్య శాఖ..

covid-19: power cuts Gandhi Hospital: minister etela says no community transmission

తెలంగాణలో లోకల్ గా కరోనా వైరస్ వ్యాప్తి విస్తృతంగా ఉందని, జాగ్రత్తలు పాటించకుంటే కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ జరగొచ్చని, రాబోయే నెల రోజులు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలంటూ హెల్త్ సర్వీసెస్ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస‌ రావు చేసిన హెచ్చరికలపై మంత్రి ఈటల భిన్నంగా స్పందిచారు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి కమ్యూనిటీ దశకు చేరలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. గురువారం కరోనా బులిటెన్ విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయనీ కామెంట్లు చేశారు.

దేశానికి రెండో రాజధానిగా విశాఖపట్నం.. వైసీపీ సాయిరెడ్డి సంచలన ప్రకటన.. జగన్ సంకల్పమంటూ..దేశానికి రెండో రాజధానిగా విశాఖపట్నం.. వైసీపీ సాయిరెడ్డి సంచలన ప్రకటన.. జగన్ సంకల్పమంటూ..

covid-19: power cuts Gandhi Hospital: minister etela says no community transmission

వైద్య శాఖ గురువారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1567 కొత్త కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 50,826కు, చనిపోయిన మొత్తం సంఖ్య 447కు పెరిగింది. ఇప్పటివరకు 3,22,326 మందికి టెస్టులు చేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది.

English summary
covid-19 dedicated Gandhi Hospital in hyderabad faces huge power cuts, Patients suffers. telangana health minister etela rajender says there is no community transmission of coronavirus in the state. his comments came after health director srinivasa rao warnng amid corona spread.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X