కేసీఆర్ ఫైర్: కరోనాకు అధిక వసూళ్లు -మరో 6 ప్రైవేట్ ఆస్పత్రులపై వేటు -జాబితాలో కిమ్స్, సన్ షైన్, సెంచరీ..
ఆవిర్భాక సంబురాలకు సిద్ధమైన తెలంగాణలో ఆరోగ్య రంగానికి సంబంధించి మంగళవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కరోనా చికిత్సకు ప్రభుత్వం నిర్ధారించిన రుసుము కంటే అధికంగా వసూళ్లు చేసినట్లు ఆరోపణలు రావడంతో హైదరాబాద్ లోని మరో ఆరు ప్రైవేటు ఆస్పత్రులపై ప్రభుత్వం వేటేసంది. ఆయా ఆస్పుల్లో కొవిడ్ చికిత్స లైసెన్సులను రద్దు చేసింది.
కొవిడ్ ట్రీట్మెంట్ లైసెన్సులు రద్దయిన ఆస్పత్రుల జాబితాలో ప్రఖ్యాత, దక్షిణ భారతానికే పేరెన్నికగల ఆస్పత్రులూ ఉండటం గమనార్హం. సర్కారు వేటేసిన ఆస్పత్రుల్లో సికింద్రాబాద్ కిమ్స్, సన్ షైన్ ఆస్పత్రి(గచ్చిబౌలి), సెంచరీ ఆస్పత్రి(బంజారాహిల్స్), లోటల్ ఆస్పత్రి(లక్డీకాపూల్), మెడిసిస్ ఆస్పత్రి(ఎల్బీ నగర్), ఇంటెగ్రో ఆస్పత్రి(టోలీచౌకీ)లు ఉన్నాయి.

తాజాగా వేటు పడిన ఆరు ఆస్పత్రులను కలుపుకొని ఇప్పటిదాకా తెంగాణ ప్రభుత్వం చర్యలకు తీసుకున్న ఆస్పత్రుల సంఖ్య 33కు పెరిగింది. హైదరాబాద్ సహా రాష్ట్రం నలుమూలల్లోని ఆస్పత్రులూ ఈ జాబితాలో ఉన్నాయి. కొవిడ్ చికిత్సకు అధిక ధరలు వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న సీఎం కేసీఆర్ కఠిన ఆదేశాలివ్వడంతో అధికారులు ఆమేరకు చురుకుగా స్పందిస్తున్నారు.
కొవిడ్ లైన్సులు కొల్పోయిన జాబితాలోని ఆరూ ఆస్పత్రుల్లో మూడు పెద్ద, ప్రముఖ ఆస్పత్రులే కావడంతో అక్కడి రోగుల పరిస్థితిని అధికారులు పర్యవేక్షించి, కొత్త కేసులు అడ్మిట్ కాకుండా జాగ్రత్తలు వహిస్తారు. ఇదిలా ఉంటే, మంగళవారం నాడు తెలంగాణలో కొత్తగా 2,493 కరోనా కేసులు, 15 మరణాలు నమోదయ్యాయి.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications