తెలంగాణలో 2 శాతానికి పడిపోయిన కోవిడ్ పాజిటివిటీ రేటు-లాక్‌డౌన్ ఎత్తేసే ఛాన్స్...!

తెలంగాణలో లాక్‌డౌన్ సత్ఫలితాలనిస్తోంది. గత 20 రోజులకు పైగా అమలవుతున్న లాక్‌డౌన్‌తో రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 2 శాతానికి పడిపోయింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2261 కరోనా కేసులు నమోదవగా మరో 18 మంది మృతి చెందారు. మరో 3043 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డా.శ్రీనివాస రావు ఈ వివరాలు వెల్లడించారు. సాధారణంగా 5 శాతం కన్నా తక్కువ కోవిడ్ పాజిటివిటీ రేటు ఉంటే... లాక్‌డౌన్ ఎత్తేసే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణలో అది 2 శాతానికి పడిపోవడంతో... లాక్‌డౌన్ ఎత్తేసే సూచనలు కనిపిస్తున్నాయి.

లాక్‌డౌన్ ఎత్తేసే ఛాన్స్ : ఆరోగ్య శాఖ డైరెక్టర్

లాక్‌డౌన్ ఎత్తేసే ఛాన్స్ : ఆరోగ్య శాఖ డైరెక్టర్


ప్రస్తుత లాక్‌డౌన్ జూన్ 9 వరకూ అమలులో ఉండనున్న సంగతి తెలిసిందే. వచ్చే వారంలో కేసుల సంఖ్య తగ్గితే లాక్‌డౌన్ ఎత్తివేసే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి కరోనా పరిస్థితులపై ఆరా తీసినట్లు చెప్పారు. గ్రామాల్లోనూ లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 55 వేలకు పైగా పడకలు కోవిడ్ పేషెంట్లకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

మూడో దశ సర్వే...

మూడో దశ సర్వే...

రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 87,49,549 ఇళ్లల్లో సర్వే చేసినట్లు తెలిపారు. సర్వేలో 4037 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. కొన్నిచోట్ల మూడో దశ ఇంటింటి సర్వే చేస్తున్నామని చెప్పారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9 లక్షల వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ఇప్పటివరకూ హైదరాబాద్‌లో 72,మేడ్చల్‌లో 48,రంగారెడ్డిలో 37 ఆస్పత్రులపై ఫిర్యాదులు వచ్చినట్లు వెల్లడించారు.

పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు

పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు

రాష్ట్రంలో గత 10 రోజులుగా బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయని శ్రీనివాస రావు వెల్లడించారు. ఇప్పటివరకూ 1100 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే అంఫోటెరిసిన్ బి,లీఫాసోమల్ మందుల కోసం రోగుల కుటుంబ సభ్యులు,బంధువులు కాకుండా... ఆయా ఆస్పత్రుల ప్రతినిధులే కోఠిలోని ప్రజారోగ్య కార్యాలయానికి వచ్చి తీసుకెళ్లాలని సూచించారు. సాధారణ అంఫోటెరిసిన్ కూడా బ్లాక్ ఫంగస్ చికిత్సకు వాడాలని సూచించారు. కోవిడ్ బారినపడుతున్న పిల్లల్లో మల్టీసిస్టమ్ ఇన్‌ఫ్లేమటరీ సిండ్రోమ్ లక్షణాలు కనిపిస్తున్నాయని... కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+