వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణా వ్యాక్సినేషన్ లో సింహభాగం కోవిషీల్డ్ టీకాదే .. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో పురుషులే అధికం !!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కోవిషీల్డ్ టీకాలదే సింహభాగమని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ జి. శ్రీనివాసరావు వెల్లడించారు. ఇప్పటివరకు తెలంగాణలో నిర్వహించిన 1.19 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ మోతాదులలో, 80.13% కోవిషీల్డ్ టీకాలు ఇచ్చినట్లుగా ఆయన పేర్కొన్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో లబ్ధిదారులకు మొత్తం 1,19,92,231 వ్యాక్సిన్ మోతాదులు ఇవ్వబడ్డాయి . అయితే వాటిలో 96.10 లక్షల మోతాదులు కోవిషీల్డ్ టీకాలు అని, 23.28 లక్షల కోవాక్సిన్ మరియు 53,172 స్పుత్నిక్ వీ ఉన్నాయని తెలుస్తుంది.

టీకాలు తీసుకున్న వారిలో పురుషులే అధికం

టీకాలు తీసుకున్న వారిలో పురుషులే అధికం

తెలంగాణ రాష్ట్రానికి స్పుత్నిక్ వీ టీకాలు 15 రోజుల క్రితం వచ్చినట్లుగా చెప్తున్నారు. సీనియర్ హెల్త్ అధికారులు అందించిన లెక్కల ప్రకారం జూలై 7 వరకు రాష్ట్రంలో వ్యాక్సిన్ కవరేజీ ఈ విధంగా ఉంది. వ్యాక్సినేషన్ తీసుకున్న వారిలో అధిక సంఖ్య మగవారు ఉన్నట్లుగా తెలుస్తుంది. 62.38 లక్షల మంది పురుషులు. 57.39 లక్షల మంది మహిళలు, 2,201 మంది హిజ్రాలు ఇప్పటివరకు వ్యాక్సినేషన్ తీసుకున్నారు. కరోనా మహమ్మారిని నియంత్రించడం కోసం టీకా కార్యక్రమం జనవరి 16 నుండి రాష్ట్రంలో ప్రారంభమైంది.

 తెలంగాణలో వ్యాక్సినేషన్ సాగింది ఇలా

తెలంగాణలో వ్యాక్సినేషన్ సాగింది ఇలా

ప్రారంభంలో, ఆరోగ్య కార్యకర్తలకు వాక్సినేషన్ ఇవ్వబడింది. తరువాత గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లోని ఉద్యోగులు మరియు పోలీసు సిబ్బంది వంటి ఫ్రంట్‌లైన్ కార్మికులు ఉన్నారు. తరువాత, ఇది సీనియర్ సిటిజన్లు మరియు అనారోగ్య సమస్యలు ఉన్న వారితో ప్రారంభించి, వయస్సు ప్రకారం సాధారణ ప్రజలకు విస్తరించింది. జూలై 7 సాయంత్రం వరకు, 1.01 కోట్ల మందికి మొదటి మోతాదు, 17.92 లక్షల రెండవ మోతాదు లభించినట్లు డేటా చూపించింది.

 అత్యధిక వ్యాక్సిన్ డోసులు , అత్యల్ప వ్యాక్సిన్ డోసులు ఇచ్చిన ప్రాంతాలివే

అత్యధిక వ్యాక్సిన్ డోసులు , అత్యల్ప వ్యాక్సిన్ డోసులు ఇచ్చిన ప్రాంతాలివే

కూరగాయలు, పండ్లు, మాంసం, దుకాణదారులు, మరియు షాప్ లో నిర్వాహకులకు, వివిధ సమూహాలకు చెందిన వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం టీకాలు వేసింది. డాక్టర్ శ్రీనివాస రావు మాట్లాడుతూ ఈ విభాగాలలో సుమారు 37 లక్షల మంది లబ్ధిదారులకు టీకాలను ఇచ్చినట్లుగా వెల్లడించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో, టీకా యొక్క అత్యధిక కవరేజ్ మూడు చోట్ల కనిపిస్తుంది. హైదరాబాద్‌లో 26.60 లక్షల టీకాలు, తరువాత రంగారెడ్డిలో 15.55 లక్షలు, మేడ్చల్-మల్కాజ్‌గిరిలో 15.06 లక్షలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. నారాయణపేటలో 58,425 మోతాదులో అతి తక్కువ మోతాదు ఇవ్వగా, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 73,357, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో 81,844 మోతాదులను ఇచ్చారు.

English summary
Of the 1.19 crore COVID vaccine doses administered in Telangana so far, a whopping 80.13 % were of Covishield. In absolute numbers, a total of 1,19,92,231 doses have been given to beneficiaries and of those, 96.10 lakh doses were of Covishield, 23.28 lakh of Covaxin and 53,172 of Sputnik, which arrived in the State just a fortnight ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X