Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాంగ్రెస్ లో కోవర్టులున్నారట ... కానీ ఎవరూ పేర్లు చెప్పరట.. పరేషాన్ చేస్తున్న హస్తం నేతలు

Recommended Video

    కాంగ్రెస్ లో కోవర్టులున్నారట... పరేషాన్ చేస్తున్న హస్తం నేతలు ! || Oneindia Telugu

    కాంగ్రెస్ పార్టీ ... తెలంగాణలో మనుగడ కోసం ప్రస్తుతం పోరాటం చేస్తున్న పార్టీ. వరుస వలసలతో కుదేలవుతున్న పార్టీ. జంప్ జిలానీలైన ఎమ్మెల్యేల వల్ల బక్కచిక్కిన పార్టీ .. అసలే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇబ్బందుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ నేతలు మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తూ పార్టీ పరువును నిలువునా తీస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో కోవర్టులున్నారని వరుస సంచలనాలు సృష్టిస్తున్నారు. పార్టీ కోసం పని చేసే సదరు నేతలు కోవర్టులు ఉన్నారని చెప్తున్నారే కానీ ఆ కోవర్టులు ఎవరో మాత్రం వెల్లడించరు. అసలే పరేషాన్ లో ఉన్న పార్టీని మరింత పరేషాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా చెప్పబడే ఆ నేతలు.

    కాంగ్రెస్ లో కోవర్టులు ఉన్నారని పేర్లు చెప్పని జగ్గా రెడ్డి

    కాంగ్రెస్ లో కోవర్టులు ఉన్నారని పేర్లు చెప్పని జగ్గా రెడ్డి

    ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీలో నేతలపై వస్తున్న విమర్శలపై ఇటీవల మాట్లాడిన జగ్గారెడ్డి కొందరు ఎమ్మెల్యేలు సొంత ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీని వీడారని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారనీ, సమయం వచ్చినప్పుడు వారి పేర్లను బయటపెడతానని చెప్పారు జగ్గారెడ్డి . కానీ వారి పేర్లను మాత్రం బయటపెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ బలహీనపడటానికి కారణం బయటి నేతలు కారణం కాదని - ఇంటి దొంగలే పార్టీకి నష్టం చేకూరుస్తున్నారన్న వాదన పార్టీలో బలంగా వినిపిస్తోంది. మరి అలాంటప్పుడు వారెవరో తెలిసిన జగ్గా రెడ్డి పేర్లు బయటపెడితే పార్టీ చర్యలు తీసుకుంటుంది కదా.. పార్టీకి నష్టం జరగకుండా కాపాడుకునే అవకాశం వుంటుంది కదా ... కానీ ఆ పని జగ్గారెడ్డి చెయ్యరు.

    కోవర్టులు ఉన్నారు .. వారిపై చర్యలు తీసుకోండి అంటూనే పేర్లు ప్రకటించని వీ హనుమంతరావు

    కోవర్టులు ఉన్నారు .. వారిపై చర్యలు తీసుకోండి అంటూనే పేర్లు ప్రకటించని వీ హనుమంతరావు

    ఇక తాజాగా పార్టీలో కోవర్టులున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు సీనియర్ నాయకుడు వీహెచ్ . మరి వీహెచ్ అలాంటి కోవర్టులు ఎవరో చెబితే సరిపోతుంది కదా..అయితే సేమ్ టూ సేమ్...జగ్గారెడ్డి తరహాలో వీహెచ్ కూడా కోవర్టుల పేర్లను వెల్లడించేందుకు ససేమిరా అంటున్నారు. సమయం వచ్చినప్పుడు కోవర్టుల పేర్లను బయటపెడతానంటూ వీహెచ్ చేసిన ప్రకటన , జగ్గారెడ్డి చేసిన ప్రకటన రెండూ ఒకటే .కానీ ఎవరూ పేర్లు బయట పెట్టరు . ఇలాగే దాగుడుమూతలు ఆడుతూ కాంగ్రెస్ శ్రేణులను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు.

    పేర్లు చెప్పకుండా కోవర్టులపై చర్యలెలాగా... పరేషాన్ చేస్తున్న హస్తం నేతలు

    పేర్లు చెప్పకుండా కోవర్టులపై చర్యలెలాగా... పరేషాన్ చేస్తున్న హస్తం నేతలు

    మరి పేర్లు బయటపెట్టకుండా... ఊరికే కోవర్టులున్నారంటూ గోల చేయడం ఎందుకో తెలియడం లేదని ఆ పార్టీలోని నేతలు... వీహెచ్ తో పాటు జగ్గారెడ్డి వైఖరిపైనా ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలే ప్రజా క్షేత్రంలో ఇమేజ్ కోల్పోతున్నాం అని తెగ బాధపడుతున్న హస్తం నేతలకు ఈ వ్యాఖ్యలు , ఈ కోవర్టుల గోల పెద్ద పరేషాన్ తెచ్చి పెట్టింది. ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేడుఅంటారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్న ఇంటి దొంగలెవరు ? ఈ నాయకులు బయట పెడతారా ? లేకా వీరిలాగా మరి కొందరు ఇదే తరహా వ్యాఖ్యలతో సంచలనం సృష్టిస్తారా ? అసలే చావు తప్పి కన్ను లొట్టపోయి , చెయ్యి లేపలేని స్థితిలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంటే కర్ర విరగదు పాము చావదు అన్న చందంగా ఈ కోవర్టుల గొడవేంది స్వామీ అంటున్నారు. ఇంటి దొంగల పేర్లు చెప్పి పంచాయితీ చెయ్యండి కానీ ఇలా పేర్లు చెప్పకుండా పరేషాన్ చెయ్యకండి అంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు .

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+