Year Ender 2022: 273 డ్రగ్స్, మొత్తం 22,060 కేసులు: ప్రశాంతమంటూ సీవీ ఆనంద్

హైదరాబాద్: ఈ ఏడాది మరికొద్ది రోజుల్లో ముగుస్తున్న క్రమంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలను ఇయర్ ఎండింగ్ క్రైమ్‌పై సమీక్ష సందర్భంగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. 2022లో ఇప్పటి వరకు 22,060 కేసులు నమోదయ్యాయని చెప్పారు. 2022 సంవత్సరం చాలా ప్రశాంతంగా ముగుస్తుందన్నారు.

కాగా, ఈ ఏడాది 273 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయని., ఈ కేసుల్లో 1082 నిందితులను అరెస్టు చేశామన్నారు. వీరిలో 13 మంది విదేశీయులున్నారని తెలిపారు. ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా 2021లో 910 మందిని, 2022లో 791 మందిని రెస్క్యూ చేశామని తెలిపారు. అందులో 74 మంది అమ్మాయిలు, 717 బాలురు ఉన్నారని చెప్పారు.

 CP CV Anand explains on Crime rate in Hyderabad this 2022 year

2022లో 2249 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయని, వీటిలో 226 కేసులు ఛేదించామన్నారు సీపీ. హ్యాకింగ్ 92 కేసులు నమోదు కాగా, 8 కేసులను ఛేదించామని తెలిపారు. ఏటీఎం/ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డులకు సంబంధించి 386 కేసులు నమోదు కాగా, వీటిలో 35 కేసులు ఛేదించామని సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. ఓఎల్ఎక్స్, ఆన్ లైన్ మోసాల్లో భాగంగా 97 కేసులు నమోదైతే, 07 కేసులు పరిష్కరించామని తెలిపారు.

ఆన్ లైన్ కమ్యూనల్ పోస్టులకు సంబంధించి 68 కేసులు నమోదు చేసి, 04 కేసులు సాల్వ్ చేశామనన్నారు సీపీ. నైజీరియన్ మోసాలు 41 కేసులు నమోదు చేయగా, 06 కేసులను ఛేదించామన్నారు. 11 మ్యాట్రిమోని కేసుల్లో 05 కేసులను పరిష్కరించామన్నారు. ఈ ఏడాది టాస్క్ ఫోర్స్ వింగ్ 1703 కేసులు నమోదు చేయగా, 3187 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు.

2021లో 2766, 2022లో 2292 ఫిర్యాదులను షీ టీమ్స్ స్వీకరించిందన్నారు. వాటిలో 137 కేసులపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయగా.. 427 కేసులు నమోదయ్యాయన్నారు. హుస్సేన్ సాగర్‌లో ఆత్మహత్యాయత్నం చేసిన 235 మందిని ట్యాంక్ బండ్ లేక్ పోలీసులు కాపాడారని సీవీ ఆనంద్ తెలిపారు.

ఆస్తుల దొంగతనం కేసుల్లో రూ.25 కోట్ల ప్రాపర్టీ చోరీ అవగా... 62% రికవరీ చేశామన్నారు. ఆర్థిక నేరాల కింద 949 కేసులు నమోదు కాగా... రూ.15 వందల కోట్లకు పైగా డబ్బును నేరగాళ్లు దోచుకున్నారని చెప్పారు. వివిధ కేసుల్లో 21 మందికి జీవితఖైదు పడేలా చేశామని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఈ ఏడాది 63 మర్డర్ కేసులు నమోదయ్యాయని తెలిపారు.

చీటింగ్ కేసులు భారీగా పెరిగాయని...ఇప్పటి వరకు 4297 కేసులు నమోదయ్యాయన్నారు. 456 గేమింగ్ కేసుల నమోదుతో పాటు 70 శాతం కన్విక్షన్ రేటు నమోదైందని చెప్పారు. 113 అట్రాసిటీ కేసులు ఫైల్ అయ్యాయన్నారు. ఈ ఏడాది 24 మందికి పైగా కొత్తగా పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు. డయల్ 100కి 2 లక్షల 33 వేల కాల్స్ వచ్చాయని తెలిపారు. ఈ ఏడాది కొత్తగా 47 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని సీవీ ఆనంద్ వివరించారు. మహిళలపై జరిగిన నేరాల్లో భాగంగా ఈ ఏడాది 2524 కేసులు నమోదయ్యాయని సీవీ ఆనంద్ తెలిపారు. వీటిలో 296 రేప్ కేసులు, 126 కిడ్నాప్ కేసులు, 1418 మహిళలపై వేధింపుల కేసులున్నాయన్నారు. ఈ ఏడాది కొత్తగా 91 మందిపై రౌడీ షీట్ పెట్టామని సీపీ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+