యూట్యూబర్లకు సజ్జనార్ మాస్ వార్నింగ్.. ఆ కంటెంట్ అప్​లోడ్​ చేస్తే ..

ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఇదే అదనుగా కొందరు వ్యూస్ కోసం తప్పుదారిలో వెళ్తున్నారు. యూట్యూబ్ లో అశ్లీల కంటెంట్ ను అప్ లోడ్ చేస్తున్నారు. అయితే తాజాగా ఇలాంటి వారికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో ఫేమస్ అయ్యేందుకు చిన్నారుల జీవితాలతో ఆడుకోవద్దని సూచనలు చేశారు. పిల్లలపై అనుచిత కంటెంట్ చేయించే వారిపై ఇకనుంచి కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.

"వ్యూస్ మాయలో విలువలు మరిచిపోతే ఎలా..? వ్యూస్, లైక్స్ తో పాటు సోషల్ మీడియాలో మీరు ఫేమస్ కావడానికి చిన్నారుల భవిష్యత్ ను పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం!?.. వారితో అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు అసలు!? చిన్నారులకు, యువతకి స్పూర్తినిచ్చే, ఆదర్శంగా నిలిచే వ్యక్తులను ఇంటర్వ్యూలు చేసి.. సమజాభివృద్దికి దోహదం చేయండి.. అంతేకానీ ఇలాంటి వీడియోలు వారితో చేసి పిల్లలను పెడదోవ పట్టించొద్దు. గుర్తుపెట్టుకోండి.. ఇది బాలల హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదు - క్షమార్హం.. చట్టరీత్యా నేరం!! ఇటువంటి చర్యలు POCSO యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ వంటి చట్టాలను ఉల్లంఘించడమే. పిల్లలను ఇలాంటి కంటెంట్‌లో భాగం చేయడం చైల్డ్ ఎక్స్‌ప్లాయిటేషనే అవుతుంది. మైనర్లతో ఈ తరహా కంటెంట్ చేసే వారిపట్ల పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుంది. బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటుంది" అని సీపీ సజ్జనార్ తెలిపారు.

"తక్షణమే వీటిని తొలగించకున్నా.. భవిష్యత్ లో ఇలాంటి కంటెంట్ అప్లోడ్ చేసిన చట్టప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు మీ దృష్టికి వస్తే వెంటనే రిపోర్ట్ చేయండి. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు కాల్ గానీ, జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి. తల్లిదండ్రులుగా మీ బాధ్యత పిల్లలను పెంచడం మాత్రమే కాదు.. వారి బాల్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, భవిష్యత్తును కాపాడటం అనే విషయాన్ని మరచిపోవద్దు. మీ పిల్లలను అనుచిత కంటెంట్ నుండి దూరంగా ఉంచండి. వారికి సానుకూల వాతావరణం, సరైన విలువలు అందించండి" అని వీసీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు.

CP Sajjanar Warns of Strict Action Against Pornographic Content on YouTube

వాట్సాప్, ఇన్ స్టా గ్రామ్, యూ ట్యూబ్, ఎక్స్, ఫేస్ బుక్ .. తదితర సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి వీడియోలు కనిపిస్తే వెంటనే పోలీసులకు రిపోర్టు చేయాలని సీపీ సజ్జనార్ కోరారు. ఈ మేరకు హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930 కు గానీ, నేషనల్​ సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌ అయిన cybercrime.gov.in లో గానీ ఫిర్యాదు చేయాలని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+