ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు: పోలీస్ కమిషనర్
ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 28వ తేదీన హైదరాబాదులో పర్యటించనున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస రావు ఆదివారం తెలిపారు.
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 28వ తేదీన హైదరాబాదులో పర్యటించనున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస రావు ఆదివారం తెలిపారు.
28వ తేదీ మధ్యాహ్నం గం.1.10 నిమిషాలకు ప్రధాని మోడీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారని తెలిపారు. 1.10-1.25 గంటల మధ్య బీజేపీ కార్యకర్తలకు అభివాదం చేసి తర్వాత హెలికాప్టర్లో మియాపూర్ చేరుకుంటారన్నారు.

మెట్రో రైలును ప్రారంభించిన అనంతరం గ్లోబల్ సదస్సును ప్రారంభిస్తారని తెలిపారు. అదేరోజు సాయంత్రం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగే ప్రత్యేక విందులో పాల్గొంటారన్నారు.












Click it and Unblock the Notifications