ముందు, ఆ తర్వాత: జూబ్లిహిల్స్‌లో ఓ స్కూల్ దుస్ధితి (ఫోటోలు)

హైదరాబాద్: నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నారులకు పాఠాలు బోధిస్తున్న పాఠశాలను డీఈఓ సోమిరెడ్డి, ఎమ్మార్వో చంద్రకళలు అక్రమంగా కూల్చివేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆల్ఫా స్వచ్ఛంద సంస్ధ పాఠశాల విద్యార్ధులు, సీపీఐ నాయకులు డాక్టర్ సుధాకర్‌ మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

దీనిపై స్పందించిన కమిషన్ సభ్యులు కాకుమాను పెదపేరిరెడ్డి జులై 13 లోపు వివరణ ఇవ్వాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి, ఎమ్మార్వోలకు నోటీసులు పంపించారు.

ప్రత్యామ్నామం చూపించకుండా అకస్మాత్తుగా పాఠశాల భవనాన్ని తొలిగిస్తే, అక్కడ చదువుతున్న పిల్లల భవిష్యత్తు ఏమిటి, హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని కాకుమాను పెద పేరిరెడ్డి ప్రశ్నించారు.

ఇటీవలే పాఠశాలకు వచ్చిన తెలంగాణ విద్యాశాఖ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు, ఎంఇఓ రామలింగేశ్వర్‌లు పాఠశాలను మూసివేయాలని, ఇక్కడి పిల్లలను బోరబండలోని ప్రభుత్వ పాఠశాలకు తరలిస్తున్నామని చెప్పారు.

పాఠశాల కూల్చివేతపై హెచ్చార్సీకి ఫిర్యాదు

పాఠశాల కూల్చివేతపై హెచ్చార్సీకి ఫిర్యాదు

నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నారులకు పాఠాలు బోధిస్తున్న పాఠశాలను డీఈఓ సోమిరెడ్డి, ఎమ్మార్వో చంద్రకళలు అక్రమంగా కూల్చివేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆల్ఫా స్వచ్ఛంద సంస్ధ పాఠశాల విద్యార్ధులు, సీపీఐ నాయకులు డాక్టర్ సుధాకర్‌ మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

పాఠశాల కూల్చివేతపై హెచ్చార్సీకి ఫిర్యాదు

పాఠశాల కూల్చివేతపై హెచ్చార్సీకి ఫిర్యాదు

దీనిపై స్పందించిన కమిషన్ సభ్యులు కాకుమాను పెదపేరిరెడ్డి జులై 13 లోపు వివరణ ఇవ్వాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి, ఎమ్మార్వోలకు నోటీసులు పంపించారు.

పాఠశాల కూల్చివేతపై హెచ్చార్సీకి ఫిర్యాదు

పాఠశాల కూల్చివేతపై హెచ్చార్సీకి ఫిర్యాదు

ప్రత్యామ్నామం చూపించకుండా అకస్మాత్తుగా పాఠశాల భవనాన్ని తొలిగిస్తే, అక్కడ చదువుతున్న పిల్లల భవిష్యత్తు ఏమిటి, హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని కాకుమాను పెదపేరిరెడ్డి ప్రశ్నించారు.

పాఠశాల కూల్చివేతపై హెచ్చార్సీకి ఫిర్యాదు

పాఠశాల కూల్చివేతపై హెచ్చార్సీకి ఫిర్యాదు

ఇటీవలే పాఠశాలకు వచ్చిన తెలంగాణ విద్యాశాఖ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు, ఎంఇఓ రామలింగేశ్వర్‌లు పాఠశాలను మూసివేయాలని, ఇక్కడి పిల్లలను బోరబండలోని ప్రభుత్వ పాఠశాలకు తరలిస్తున్నామని చెప్పారు.

పాఠశాల కూల్చివేతపై హెచ్చార్సీకి ఫిర్యాదు

పాఠశాల కూల్చివేతపై హెచ్చార్సీకి ఫిర్యాదు

అనంతరం హెచ్చార్సీ ముందు సీపీఐ నాయకులు మాట్లాడుతూ జాబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 22 వద్ద 15 సంవత్సరాలుగా ఆల్ఫా స్వచ్ఛంద సంస్ధ ఆధ్వర్యంలోని పరిసర ప్రాంతాల్లో ఉన్న నిరుపేద కుటుంబాల చిన్నారులకు ఉపాధ్యాయులు విద్యా బోధనలు చేస్తూ వారిని తీర్చిదిద్దుతున్నారని ఆయన తెలిపారు.

పాఠశాల కూల్చివేతపై హెచ్చార్సీకి ఫిర్యాదు

పాఠశాల కూల్చివేతపై హెచ్చార్సీకి ఫిర్యాదు

అయితే ఈ పాఠశాలలో 140 మంది విద్యార్ధులకు ఐదుగురు ఉపాధ్యాయులు ఉత్తమ బోధనను అందిస్తున్నారని ఆయన తెలిపారు.

పాఠశాల కూల్చివేతపై హెచ్చార్సీకి ఫిర్యాదు

పాఠశాల కూల్చివేతపై హెచ్చార్సీకి ఫిర్యాదు

అయితే గత శనివారం డీఈఓ సోమిరెడ్డి, ఎమ్మార్వో చంద్రకళలు ఆల్ఫా స్వచ్ఛంద సంస్ధకు ప్రత్యామ్నాయం చూపకుండా నిర్ధాక్షిణ్యంగా కూల్చి వేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పాఠశాల కూల్చివేతపై హెచ్చార్సీకి ఫిర్యాదు

పాఠశాల కూల్చివేతపై హెచ్చార్సీకి ఫిర్యాదు

దీంతో పాఠాలు చదువుకునేందుకు తరగతి గదులు లేకపోవడంతో విద్యార్ధులు రోడ్డు పాలయ్యారని అన్నారు. ప్రస్తుతం వారి విద్యా జీవితం గందరగోళంగా మారిందని ఆయన తెలిపారు.

పాఠశాల కూల్చివేతపై హెచ్చార్సీకి ఫిర్యాదు

పాఠశాల కూల్చివేతపై హెచ్చార్సీకి ఫిర్యాదు

దీంతో ప్రభుత్వం స్పందించి పాఠశాలకు ప్రత్యామ్నాయంగా విద్యార్ధులు చదువుకునేందుకు భవనాన్ని నిర్మించే వరకు విద్యార్ధులకు పాఠాలను పుట్ పాత్‌లపైనే బోధిస్తామని ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+