'కాళేశ్వరం పనుల్లో మరణాలపై జ్యుడిషియల్ విచారణ'
కాళేశ్వరం: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం టెన్నెల్ పనుల్లో పైకప్పు నుంచి బండరాళ్లు పడి ఏడుగురు కార్మికులు చనిపోయిన సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణ జరిపించాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.
మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా కోటి రూపాయలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని పార్టీ తరఫున వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

ఇంజినీర్లు భోజనం చేస్తున్న సమయంలో కూలీలు మాత్రమే పని చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.
భోజన విరామ సమయంలో కార్మికులతో ఎందుకు పని చేయించారో స్పష్టం చేయాలని, ముమ్మాటికీ యాజమాన్యం నిర్లక్ష్యమేనని అన్నారు.












Click it and Unblock the Notifications