లారీ క్లీనర్ నుంచి ఎమ్మెల్యేగా -శోకంలో కార్మిక లోకం - సీపీఐ నేత గుండా మల్లేశ్ కన్నుమూత
సమసమాజం అనే కలను చేరడానికి ప్రజాస్వామ్య మార్గాన్ని ఎంచుకుని.. ప్రజాఉద్యమాలతోనే వ్యవస్థాగత మార్పులు సాధ్యమని నమ్మి.. అదే పంథాలో నడిచి.. కార్మిక వర్గానికి గొంతుకగా, తన దళిత వర్గానికి బాసటగా నిలిచిన ప్రముఖ సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ ఇకలేరు. గత కొద్దికాలంగా కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిశారు.
జగన్ ఆమె దుస్తులు విప్పేస్తున్నారు - సీఎంగా 3.5ఏళ్లు కష్టం - కాపాడేది ఆయనొక్కడే: ఎంపీ రఘురామ

మగ్దూమ్ భవన్ లో నివాళి
గుండా మల్లేశ్ మరణంతో కార్మిక లోకంతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు, కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారు. పలువురు నేతలు గుండా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపం ప్రకటిస్తున్నారు. మల్లేశ్ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం నారాయణగూడలోని మక్దూమ్ భవన్‌కు తరలించారు. అనంతరం భౌతికకాయాన్ని ఆయన సొంత ఊరు బెల్లంపల్లికి తరలిస్తారు.
జడ్జిలపై ఫిర్యాదు: జగన్ కు భారీ షాక్ - సీఎంపై చర్యలకు సుప్రీంకోర్టులో పిటిషన్ -ఆర్టికల్ 121, 211

లారీ క్లినర్‌గా మొదలై..
ప్రజాస్వామిక రాజకీయాల్లో పేదలు, మరీ ముఖ్యంగా దళితుల ప్రాతినిధ్యానికి సంబంధించి గుండా మల్లేశ్ జీవితాన్ని సోదాహరణగా చెబుతారు. పేద కార్మిక కుటుంబం నుంచి వచ్చిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలం రేచిని గ్రామానికి చెందిన మల్లేశ్ మెట్రిక్యులేషన్ చదివి, బెల్లంపల్లిలోని రామా ట్రాన్స్‌పోర్టులో క్లీనర్‌గా, డ్రెవర్‌గా పనిచేశారు. తోటి క్లీనర్లు, డ్రెవర్ల సమస్యలపై పోరాడారు. ఆ తర్వాత సింగరేణిలో కార్మికుడిగా చేరి సీపీఐలో సభ్యత్వం తీసుకున్నారు. అది ఆయన జీవితంలో కీలక మలుపుగా నిలిచింది..

నాలుగుసార్లు ఎమ్మెల్యే..
సింగరేణిలో కార్మిక నేతగా గుండా మల్లేశ్ మంచి పేరు తెచ్చుకున్నారు. 1970లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారారు. యూనియన్ నేతగా కొనసాగుతూ కార్మికుల పక్షాన కీలక పోరాటాలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 1983లో తొలిసారి ఆసిఫాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్ హవాలోనూ తన ఉనికి నిలబెట్టుకుని మల్లేశ్ ప్రత్యేకత చాటుకున్నారు. ఆ తర్వాత 1985, 1994 ఎన్నికల్లోనూ గెలిచారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత బెల్లంపల్లి నుంచి ఎన్నికై సీపీఐ పక్షనేతగా వ్యవహరించారు. తెలంగాణ ఉద్యమంలోనూ కీలక భూమిక పోషించారు. గుండా మల్లేశ్ మృతి పట్ల సీపీఐ జాతీయ, రాష్ట్ర నేతలు, ఇతర పార్టీలకు చెందిన నాయకులూ సంతాపం తెలిపారు.