టీఆర్ఎస్‌కు మేయర్ పీఠం దక్కితే చెవి కోసుకుంటా: నారాయణ (ఫోటోలు)
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తన సొంత మెజార్టీతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటే తాను చెవి కోసుకుంటానని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ చెప్పారు. శుక్రవారం నేరేడ్‌మెట్ కూడలిలో సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా పార్టీలు సంయుక్తంగా నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటీశ్వరులకు, భూ ఆక్రమణదారులకు టికెట్లు కేటాయించి అడ్డదారిలో గ్రేటర్ ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉండే సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా పార్టీల అభ్యర్ధులను గెలిపించాలని కోరారు.

టీఆర్ఎస్‌కు మేయర్ పీఠం దక్కితే చెవి కోసుకుంటా: నారాయణ
టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ ఒకే బాటలో నడుస్తున్నాయని అన్నారు. గ్రేటర్‌లో తామే గెలుస్తామని కేసీఆర్, కేటీఆర్ కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. తుకారం గేట్ వద్ద వాహనదారులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అన్నారు.

టీఆర్ఎస్‌కు మేయర్ పీఠం దక్కితే చెవి కోసుకుంటా: నారాయణ
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అవినీతి రాజకీయాలను ఓడించి నీతి, నిజాయితీ పాలన కోసం 'వన్ హైదరాబాద్' కూటమి అభ్యర్థులను గెలిపించాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఐ(ఎం) అభ్యర్థి స్వర్ణలతను గెలిపించాలని కోరారు.
టీఆర్ఎస్‌కు మేయర్ పీఠం దక్కితే చెవి కోసుకుంటా: నారాయణ
స్వచ్ఛ రాజకీయాల కోసమే సీపీఐ(ఎం), సీపీఐ, ఎంసీపీఐ(యు), లోక్‌సత్తాలతో 'వన్ హైదరాబాద్ కూటమి' ఏర్పడిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికారంలోకొచ్చిన టీఆర్‌ఎస్ పార్టీ ఉచిత వాగ్దానాలతో కాలయాపన చేస్తున్నదన్నారు.

టీఆర్ఎస్‌కు మేయర్ పీఠం దక్కితే చెవి కోసుకుంటా: నారాయణ
మంత్రివర్గంలో మహిళా మంత్రి లేకపోవడమేంటని, మహిళలకు మంత్రి పదవి ఎందుకివ్వలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలు మంత్రిగా ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉన్నదా అని అనడం శోచనీయమన్నారు.

టీఆర్ఎస్‌కు మేయర్ పీఠం దక్కితే చెవి కోసుకుంటా: నారాయణ
దీన్ని బట్టి కేసీఆర్‌కు మహిళల పట్ల ఉన్న వివక్ష అర్థమవుతోందన్నారు. ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చుచేసి నగరాన్ని దోచుకోవడానికి ఎదురుచూస్తున్నారన్నారు. అడ్డగుట్టలోని మహీంద్రహిల్స్‌లో పేదలకు ఇండ్ల పట్టాల కోసం గుడిసెలు వేశారని, ప్రజల సమస్యల పరిష్కారానికి సీపీఐ(ఎం) నిరంతరం పోరాడుతోందని అన్నారు.

టీఆర్ఎస్‌కు మేయర్ పీఠం దక్కితే చెవి కోసుకుంటా: నారాయణ
నగరంలోని హెచ్‌సీయూలో పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేస్తుంటే సీఎం కేసీఆర్ పరామర్శించలేదని విమర్శించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ నీతి తప్పిన రాజకీయాలు చేస్తున్న టీఆర్ఎస్, టీడీపీ-బీజేపీ అభ్యర్ధులను ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

టీఆర్ఎస్‌కు మేయర్ పీఠం దక్కితే చెవి కోసుకుంటా: నారాయణ
నేరేడ్‌మెట్ డివిజన్ సీపీఐ అభ్యర్థిగా సంతోష యాదవ్‌ను ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గ్రేటర్ ఎన్నికలలో ప్రజా సమస్యలపై దృష్టి సారించే పార్టీలకే ఓటెయ్యాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నరసింహారావు, సీపీఐ రాష్ట్ర నాయకులు గుండామల్లేష్, లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షులు పాండురంగారావు ప్రచారం నిర్వహించారు.












Click it and Unblock the Notifications