హుజుర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వనున్న సిపిఐ...

హుజుర్‌నగర్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ పార్టీ కలిసివచ్చే భాగస్వామ్య పక్షాల కోసం ఎదురుచూస్తోంది. ఈనేపథ్యంలోనే ఎన్నికల మద్దతు కోసం కమ్యునిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ ) నేతలను టీఆర్ఎస్ నేతలు కలిశారు. ఎన్నికల్లో మద్దతు కోసం టీఆర్‌ఎస్‌ పార్టీ సెక్రటరీ జనరల్‌ కే కేశవరావు, లోక్‌సభ పక్షనేత నామా నాగేశ్వర్‌రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవన్‌కు వెళ్లారు.

ఈ నేపథ్యంలోనే ఇరుపార్టీల మధ్య చర్చలు జరిగాయి. అనంతరం మీడియాతో ఇరుపార్టీల నేతలు మీడియాతో మాట్లాడారు. సీఎం కేసిఆర్ ఆదేశాలతోనే తాము సిపిఐని కలిసినట్టు పార్టీ జనరల్ సెక్రటరీ కేకే తెలిపారు. హుజుర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో సిపిఐ పోటి చేయకపోవడంతో మద్దతు కోరేందుకు వచ్చామని చెప్పారు. దీంతో సిపిఐ నేతలు మద్దతుకు సుముఖంగా ఉన్నారని ఆయన తెలిపారు. కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలో కొనసాగుతున్న యురేనియం ,పోడుభూముల సమస్యపై టీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు తెలిపిందని చెప్పారు. ఇందులో భాగంగానే యురేనియం తవ్వకాలను నిలిపివేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఉప ఎన్నికలో మద్దతు సహా చాలా అంశాలపై సీపీఐతో చర్చించామని' కేకే పేర్కొన్నారు.

CPI ready to support to TRS in Huzurnagar by elections

కాగా టీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చేందుకు సిపిఐ సిద్దంగా ఉందని భావిస్తున్నట్టు కేకే తెలిపారు. ఈ నేపథ్యంలోనే పార్టీకి మద్దతు ఇస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలోనే కమ్యునిస్టు పార్టీలు తోక పార్టీలు అనుకోవడం తప్పు అని పేర్కొన్నారు. మరోవైపు సిపిఐ రాష్ట్ర అధ్యక్షుడు చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ సానుకూలంగా స్పందించారు. అక్టోబర్ 1న పార్టీ కార్యవర్గ సమావేశంలో పోత్తులపై చర్చించి తమ నిర్ణయం వెలువరుస్తామని చాడ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+