రేవంత్ చేతికి బ్రహ్మాస్త్రం - కేటీఆర్ "ఫిక్స్"..!!
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏడాది పాలన పూర్తి చేసుకున్న రేవంత్ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. పాలనలో .. రాజకీయంగా నూ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. రెండు కేసుల్లో మాజీ సీఎం కేసీఆర్ .. మాజీ మంత్రి కేటీఆర్ కు ఉచ్చు బిగుస్తోంది. ఇక, ప్రభుత్వంలో తాజాగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కేటీఆర్ ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. తరువాతి నిర్ణయాల పై ఆసక్తి కొనసాగుతోంది.
సీఎస్ లేఖతో
మాజీ మంత్రి కేటీఆర్ కు ఉచ్చు బిగుస్తోంది. ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు వ్యవహారంలో తాజా పరిణామంతో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశంలో ఇప్పటి కే గవర్నర్ విచారణకు అనుమతి ఇచ్చారు. దీంతో, ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేయాలని కోరుతూ ఏసీబీకి తెలంగాణ సీఎస్ శాంతికుమారి లేఖ రాశారు. గవర్నర్ ఇచ్చిన అనుమతిని సీఎస్ తాను రాసిన లేఖకు జత చేసి ఏసీబీకి పంపించారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో నిధుల దుర్వినియోగంపై పూర్తి విచారణ జరపాలని సీఎస్ కోరారు.

విచారణ షురూ
ఈ లేఖలో సీఎస్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్ణయాలు.. అనుమతులు.. పూర్వాపరాలు.. నిర్వహణ విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ తీసుకున్న చర్యల పైనా సమగ్ర దర్యాప్తు చేయాలని సీఎస్ సూచించారు. ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ కరెన్సీ చెల్లింపు పైన అభియోగాలు ఉన్నాయి. ప్రజాధనం దుర్వినియోగం చేసారనేది ప్రధాన ఆరోపణ. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ చెల్లింపులు చేయటం పైన పూర్తి స్థాయిలో విచారణ చేయాలని కోరారు. ఇదే కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌తో పాటు మరో ఇద్దరు అధికారులు ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్నారు.
వాట్ నెక్స్ట్
అయితే, ఈ కేసులో కేటీఆర్ ను ఏ -1 గా చేర్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు సీఎస్ లేఖతో ఏసీబీ విచారణ ప్రారంభించే అవకాశం ఉంది. అందులో భాగంగా రూ.55 కోట్ల ఫార్ములా-ఈ నిధుల దుర్వినియోగం కేసులో విచారణకు తమ ముందు హాజరు కావాలంటూ ఏసీబీ కేటీఆర్‌కు నోటీసులు పంపనుంది. తాజాగా ఏసీబీ అధికారులు కేటీఆర్ కేసుకు సంబంధించిన వివరాలను సీఎంకు వివరించినట్టు సమాచారం. దీంతో... ఇప్పుడు ఈ కేసులో ఏసీబీ తీసుకునే నిర్ణయాలు.. జరిగే పరిణామాల పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications