ఛీ సంస్కారం లేని ఎదవలు..!యువతితో అసభ్యంగా ప్రవర్తించి జైలుపాలయ్యారు..!!
హైదరాబాద్ : కొంత మంది విచక్షణ కోల్పోయి ఎక్కడ ఎలా ప్రవర్తిస్తున్నాం అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోతారు. మర్చిపోతారా లేక మదమెక్కి అలా ప్రవిర్తిస్తారో అర్థాకాకుండా ఉంటుంది. కొందరు ఒళ్లు కొవ్వెక్కి సినిమా హాళ్లలో అమ్మాయిలను వేధిస్తే మరికొంత మంది యెదవలు బస్టాండ్లలో అమ్మాయిలను ఆటపట్టిస్తుంటారు. మరికొంత మంది బలుపు రాయుళ్లు బస్సుల్లో ప్రయాణిస్తున్న ఒంటరి మమిళలను, చదువుకునే అమ్మాయిలను టార్గెట్ చేస్తుంటారు. నోట్లో గుట్కా వేసుకుని, గారపట్టిన పళ్లతో వెకిలిగా నవ్వుతూ అమ్మాయిలను వేధించేందుకు రోడ్లమీదకి వస్తుంటారు ఇలాంటి సన్నాసులు.
ఇక తాజాగా బస్సులో ప్రయాణిస్తున్న యువతిని వేధించడంతోపాటు ఆమె సోదరునిపై దాడి చేసిన ఇద్దరికి కోర్టు మూడు రోజుల జైలు శిక్ష విధించింది.చిక్కడపల్లి ఎస్సై బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం... రెండు రోజుల క్రితం కాచిగూడ నుంచి సిక్రిందాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులో అన్నాచెల్లెలు ప్రయాణిస్తున్నారు. వారి వెనుక సీటులో కూర్చున్న భోలక్‌పూర్ డివిజన్ బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ సర్మద్ హుస్సేన్(40), మహ్మద్ ఆయూబ్(37) కాళ్లు ముందుకు పెడుతూ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. కాళ్లు వెనక్కి పెట్టుకోవాలని వారికి సూచించిన ఆమె అన్నపై ఇద్దరు దాడి చేశారు.

కండక్టర్ చిక్కడపల్లి ఠాణా వద్ద బస్సును నిలిపివేయించి ఇద్దరిని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం నాంపల్లి 5వ ఎంఎం కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి వారికి మూడు రోజుల జైలు శిక్ష విధించారు. ఇంగిత జ్ఞానం కోల్పోయి బరితెగించి ప్రవర్తించిన ఎదవలకు మంచి శిక్షే పడిందనుకుంటున్నారు అక్కడకు చేరుకున్న స్థానికులు.












Click it and Unblock the Notifications