హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘మా’, బీజేపీకి సీవీల్ నర్సింహారావు రాజీనామా: ప్రకాశ్‌రాజ్, బండి సంజయ్‌కి క్షమాపణలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్ష పోటీ నుంచి వైదొలిగిన సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు శుక్రవారం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పిన ఆయన.. ఒకవేళ అది జరగపోతే 'మా' సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 'మా' సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. అంతేగాక, భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా సీవీఎల్ నరసింహారావు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్ష రాయకముందే ఫెయిల్ అయ్యానని చెప్పారు.

 CVL Narasimha Rao resigned for Movie artists association and BJP, says sorry to prakash raj and Bandi Sanjay

దివంగత నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్, దర్శకుడు దాసరి నారాయణరావు.. అందరి ఆశీస్సులు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ఎన్నికలు హాయిగా ముగుస్తాయి. ఒక వేళ అలా ముగియకపోతే నేను 'మా'కి రాజీనామా చేస్తా. ఇందులో ఇక సభ్యుడిగా కూడా ఉండను. ఇలాంటి గందరగోళ, ఇబ్బందికర, దరిద్రమైన పరిస్థితులకి నేను దోహదం చేశాను కాబట్టి ఇకపై ఓటు వేయను అని సీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు.

మా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీవీఎల్ తీసుకున్న నిర్ణయం, ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని ప్రకటించిన సీవీఎల్.. గంటల వ్యవధిలోనే పోటీ నుంచి విరమించుకున్న విషయం తెలిసిందే. దీంతో మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. అక్టోబర్ 10న మా ఎన్నికలు జరగనున్నాయి.

మరోవైపు బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా సీవీఎల్ నరసింహారావు రాజీనామా చేశారు. బీజేపీ సినిమా సెల్‌కి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బురదలో ఉన్నా వికసించడానికి తాను కమలాన్ని కాదు అని వ్యాఖ్యానించారు. పరీక్ష రాయకుండానే ఫెయిల్ అయ్యానని అన్నారు. 'మా' విషయంలో ప్రకాశ్‌రాజ్‌కి, బీజేపీ విషయంలో తనపై ఎంతో నమ్మకం పెట్టుకున్న ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కి క్షమాపణలు చెబుతున్నట్లు సీవీఎల్ తెలిపారు. ధర్మాన్ని రక్షించడానికి చాలా మంది ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.

కాగా, ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రకాశ్ రాజ్‌కు మెగా హీరోల మద్దతు ఉండగా, మంచు విష్ణుకు మోహన్ బాబు సహా పలువురు మద్దతిస్తున్నారు. మరోవైపు నాగబాబు.. విష్ణును టార్గెట్ చేస్తూ నేరుగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ప్రకాశ్ రాజ్ మాత్రమే 'మా’ అధ్యక్ష పదవికి న్యాయం చేయగలుగుతారని చెబుతున్నారు. మరోవైపు, మంచు విష్ణుకు మద్దతుగా మోహన్ బాబు రంగంలోకి దిగారు. క్రమశిక్షణకు తన వారుసుడు మంచు విష్ణు అని, ఆయనకు మద్దతుగా నిలవాలని మా సభ్యులను కోరారు మోహన్ బాబు.

English summary
CVL Narasimha Rao resigned for Movie artists association and BJP, says sorry to prakash raj and Bandi Sanjay.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X