హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఢిల్లీ పోలీసుల నుంచి తప్పించుకుని...: 164 సిమ్ కార్డులు, స్వైపింగ్ మిషన్

బ్యాంకు ఖాతాలను తస్కరించి డబ్బులు కొల్లగొడుతున్న సైబర్ క్రైమ్ నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. సిమ్‌కార్డులను విక్రయించకుండా తానే బ్యాంకు మేనేజర్‌నంటూ ఫోన్లు చేసి, బ్యాంకు ఖాతాల వివరాలను దొంగిలిస్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బ్యాంకు ఖాతాలను తస్కరించి డబ్బులు కొల్లగొడుతున్న సైబర్ క్రైమ్ నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. వికాస్ ఝా అనే అతను ఢిల్లీ యూనివర్శీటీలో బీకాం చదివాడు. వివిధ కంపెనీల సిమ్‌కా ర్డుల విక్రయానికి డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాడు. ఆ సిమ్‌కార్డులను విక్రయించకుండా తానే బ్యాంకు మేనేజర్‌నంటూ ఫోన్లు చేసి, బ్యాంకు ఖాతాల వివరాలను దొంగిలిస్తున్నాడు.

ఈ ఘరానా మోసగాడిని హైదరాబాద్ సీసీఎస్ సైబర్‌క్రైం పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేసి నగరానికి తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సైబర్‌క్రైం ఏసీపీ రఘువీర్ మీడియా సమావేశం లో వెల్లడించారు. అతని బాగోతం ఇలా బయటడింది. హైదరాబాదులోని మాసబ్‌ట్యాంక్‌కు చెందిన సీహెచ్.నాగేశ్వరరావు వృత్తిరీత్యా సర్వీస్ ట్యాక్స్ కన్సల్టెంట్. సైఫాబాద్‌లోని ఆంధ్రాబ్యాంకులో ఆయనకు బ్యాంకు ఖాతా ఉంది.

Vikas Jha

ఆయన ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ లావాదేవీలు జరుపుతుంటాడు. ఈ క్రమంలో బ్యాంకుకు సంబంధించిన లావాదేవీల విషయంలో ఇబ్బందులు రావడంతో ఆయన కన్జ్యూమర్‌కైంప్లెంట్.కామ్ అనే వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేశాడు. వెంటనే వికాస్ ఝా తాను బ్యాంకు మేనేజర్‌నని, సమస్యను పరిష్కరిస్తానంటూ ఫోన్ చేయడంతో నమ్మిన నాగేశ్వరరావు తన నెట్ బ్యాంకింగ్ యూజర్‌ఐడీ, పాస్‌వర్డ్ చెప్పేశాడు. దీంతో ఆయన ఖాతాలో నుంచి సుమారు రూ. 3 లక్షలు ఇతర ఖాతాలకు బదిలీ అయ్యాయి. ఈ విషయమై వెంటనే నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ వ్యవహారం ఢిల్లీ నుంచి జరిగినట్లు గుర్తించిన దర్యాప్తులో తేలడంతో ఇన్‌స్పెక్టర్ తివారీ బృందం నిందితుడి కోసం గాలింపు చేపట్టింది. నిందితుడిని బీహార్‌కు చెందిన వికాస్ ఝాగా గుర్తించి ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఢిల్లీలో ఎయిర్‌టెల్, హోడా ఫోన్ కంపెనీల నుంచి సిమ్‌కార్డులు విక్రయించేందుకు డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాడు.

ఇతని వద్దకు వచ్చే సిమ్‌కార్డులకు ఏ చిరునామా ఇచ్చినా యాక్టివేట్ అవుతాయి, అడ్రస్ వెరిఫికేషన్‌లో అడ్రస్ తప్పని తేలితే నెలరోజుల తరువాత ఆ సిమ్‌కార్డు డీ యాక్టివేట్ అవుతుంది. దీనిని ఆసరాగా చేసుకున్న ఝా కన్జ్యూమర్‌కైంప్లెంట్.కామ్, ఇతర బ్యాంకు ఫిర్యాదులకు సంబంధించిన హెల్ప్‌డెస్క్‌ల వెబ్‌సైట్ల నుంచి డాటా తీసుకుంటూ, అందులోని ఫిర్యాదుదారులకు బ్యాంకు ప్రతినిధినంటూ ఫోన్ చేస్తాడు.

ఇది నమ్మిన వినియోగదారుడు వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంతో పాటు రహస్యంగా ఉంచాల్సిన ఓటీపీలు, నెట్ బ్యాంకింగ్ వివరాలు, సీవీవీ, కార్డు నెంబర్లు చెప్పేస్తున్నారు. దేశ వ్యాప్తంగా వికాష్ ఝా ఇలా మోసాలు చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఇతని నుంచి రూ . 55 వేల నగదు, 164 సిమ్‌కార్డులు, పలు బ్యాంకుల చెక్‌బుక్‌లు, ఏటీఎం కార్డులు, స్వైపింగ్ మిషన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వికాస్ ఝాపై ఒడిస్సా, ఢిల్లీలో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఒడిస్సాలో నమోదయిన కేసులో అక్కడి పోలీసులు ఢిల్లీలో వికాస్‌ను అరెస్ట్ చేసి ట్రైన్‌లో తరలించేందుకు ప్రయత్నిస్తుండగా పారిపోయాడు. తరువాత అతని ఆచూకీ తెలుసు కొని అక్కడి పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.

English summary
Accused in cyber crime, Vikas Jha from Bihar hs been nabbed by Hyderabad police in Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X