గర్భిణీ హత్య: అవే పట్టించాయి.. ఇలా చేధించారు, 'పింకీతో సహజీవనం మమతతో సంబంధం'

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: సైబరాబాద్‌ పోలీసులకు సవాల్‌గా మారిన గర్భిణి దారుణ హత్య కేసులో ఎట్టకేలకు నిజానిజాలను పోలీసులు చేధించారు. విచారణలో నిందితుల నుంచి పూర్తి వివరాలు రాబట్టిన పోలీసులు.. మంగళవారం సైబరాబాద్ సీపీ సందీప్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు.. కేసుకు సంబంధించిన వివరాల్ని వెల్లడించారు.

గర్బిణీ హత్య వెనుక 'మిస్టరీ' ఇదే: ఎలక్ట్రిక్ కట్టర్‌తో ముక్కలుగా నరికేశారు..

  గర్బిణి హత్య వెనుక వివాహేతర సంబందం?
   పింకీకి 15ఏళ్ల క్రితమే పెళ్లయింది..:

  పింకీకి 15ఏళ్ల క్రితమే పెళ్లయింది..:

  గర్బిణీ హత్య కేసులో మృతురాలు సహా నిందితులంతా బీహార్ నుంచి బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చినవారేనని పోలీసులుు వెల్లడించారు.

  పింకీది బీహార్ లోని ఒక కుగ్రామం అని.. 15ఏళ్ల క్రితమే దినేశ్ అనే వ్యక్తితో ఆమెకు వివాహం జరిగిందని తెలిపారు. బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చిన క్రమంలోనే వికాస్‌తో పరిచయం ఏర్పడిందని, ఆపై ఇద్దరూ సహజీవనం చేస్తూ వస్తున్నారని చెప్పారు.

   పింకీతో సహజీవనం.. మమతతో సంబంధం..:

  పింకీతో సహజీవనం.. మమతతో సంబంధం..:

  ఇక నిందితులు వికాస్, మమత, అమర్ కాంత్ ఝా, అనిల్ ఝా.. వీళ్లు కూడా బీహార్ నుంచే నగరానికి వలస వచ్చారని పోలీసులు తెలిపారు. మమతతో చాలాకాలంగా వికాస్‌కు వివాహేతర సంబంధం ఉందని చెప్పారు.

  పింకీతో సహజీవనం చేస్తూనే మమతతోనూ ఆ సంబంధాన్ని కొనసాగించినట్టు వెల్లడించారు. ఇదే క్రమంలో పింకీ, వికాస్-మమతలకు మధ్య గొడవలు తలెత్తినట్టు చెప్పారు.

  అవే పట్టించాయి:

  అవే పట్టించాయి:

  శవాన్ని మూటగట్టి బొటానికల్ గార్డెన్ వద్ద పడేసిన సమయంలో నిందితుల కదలికలు సీసీటీవి రికార్డుల్లో రికార్డయిన సంగతి తెలిసిందే. మొత్తం 150సీసీటీవి ఫుటేజీలను పరిశీలించి కేసును చేధించినట్టు పోలీసులు తెలిపారు. మడ్ గార్ లేని బైక్, నిందితుడు వేసుకున్న బ్లూ టీషర్టే వారిని పట్టించాయని చెప్పారు. కేసును చేధించడంలో భాషా,మజీద్ అనే కానిస్టేబుళ్లు కీలకంగా వ్యవహరించినట్టు చెప్పారు.

   పబ్ యజమానికి సహకారంతో..

  పబ్ యజమానికి సహకారంతో..

  బైక్ నంబర్ ఏపీ 10ఏఎల్9947గా తేలడంతో.. దానికి సంబంధించిన స్పాట్‌ పేమెంట్‌ చలాన్‌ ఆధారంగా కేసును కొలిక్కి తెచ్చారు. హఫీజ్ పేటలో బైక్ యజమాని రాంగ్ రూట్‌లో డ్రైవ్ చేసిన కారణంగా ఇటీవల అతనికి చలానా విధించారు. ఆ సమయంలో అతని నంబర్ కూడా నోట్ చేసుకున్నారు. ఆ ఫోన్ నంబర్ పోలీసుల పనిని మరింత సులువు చేసింది.

  ఆ ఫోన్ నంబర్ ఆధారంగా బైక్ యజమాని గచ్చిబౌలిలోని ద లాల్‌స్ట్రీట్‌ పబ్‌ మేనేజర్, ఒడిశా వాసి సిద్ధార్థ బర్ధన్‌గా గుర్తించారు. అతన్ని సంప్రదించి.. సీసీఫుటేజీ చూపించగా.. నిందితుడు అమర్‌కాంత్ ఝా తమ పబ్‌లోనే వెయిటర్‌గా చేస్తున్నాడని, తన బైక్ తీసుకెళ్లాడని వెల్లడించాడు.

   బాలుడు పింకీ కొడుకు?:

  బాలుడు పింకీ కొడుకు?:

  పబ్ యజమాని సిద్దార్థ చెప్పిన వివరాలతో సిద్ధిఖీనగర్‌లోని అమర్ కాంత్ ఇంట్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. పలు కీలక వివరాలు సేకరించడంతో పాటు అమర్ కాంత్ ఝా తల్లిదండ్రులు మమతా ఝా, అనిల్‌ ఝాలతో పాటు ఆరేళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ బాలుడు పింకీ కొడుకు అని తెలుస్తోంది. ఇక బీహార్ పారిపోయిన అమర్ కాంత్‌ను సోమవారం అరెస్ట్ చేసి తీసుకొచ్చారు.

   ఆ శబ్దానికి ఎవరికీ వినిపించలేదు:

  ఆ శబ్దానికి ఎవరికీ వినిపించలేదు:

  పింకీని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి వికాస్ సహా అమర్‌కాంత్ అతని కుటుంబ సభ్యులు ఆమెను హత్య చేశారు. ఇంట్లోని బాత్రూమ్ లో హత్య చేసి ఎలక్ట్రిక్ కట్టర్ తో ముక్కలు చేశారు.

  ఆ సమయంలో పక్కనే బోర్ వెల్ వర్క్ నడుస్తుండటంతో ఆ శబ్దానికి పక్కవాళ్లకు ఇదేమి వినిపించలేదని పోలీసులు తెలిపారు. ఎలక్ట్రిక్ కట్టర్, ఒక బ్యాగును అంతకుముందు రోజే అమర్ కాంత్ కొనుగోలు చేసినట్టు చెప్పారు. శవాన్ని ముక్కలు చేశాక.. బ్యాగులో తీసుకెళ్తే అనుమానం రాదనుకున్నారని పేర్కొన్నారు.

  పరారీలో వికాస్:

  పరారీలో వికాస్:

  నిందితురాలు మమతకు 15ఏళ్ల వయసులోనే పెళ్లయిందని.. ఆమె భర్త ఒక వృద్దుడు అని.. ఈ నేపథ్యంలోనే వికాస్ తో వివాహేతర సంబంధం ఏర్పడిందని పోలీసులు తెలిపారు.

  మూడు రోజుల క్రితం వరకు చాట్ బండార్ నడిపిన వికాస్.. హత్య విషయం బయటకు రాగానే పరారయ్యాడని, ప్రస్తుతం అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Cyberabad Commissioner Sandeep Shandilya talked to media on Pregnant woman murder in gachibowli. CP explained all the details regarding murder.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి