హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'చావు కబురు చల్లగా...' హీరో కార్తీకేయకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వార్నింగ్...

|
Google Oneindia TeluguNews

'చావు కబురు చల్లగా...' అంటూ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో కార్తీకేయకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. సినిమా పోస్టర్‌ను రోడ్ సేఫ్టీ ప్రమోషన్‌కు భలే వాడేసుకున్నారు. పోలీసుల క్రియేటివిటీ చూసి... వాడటంలో మీ తర్వాతే ఎవరైనా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 'అటు సినిమాకు ప్రమోషన్... ఇటు రోడ్ సేఫ్టీపై ప్రజలకు అవగాహన... ఐడియా అదిరింది..' అని అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ సైబరాబాద్ పోలీసులు హీరో కార్తీకేయకు ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా...?

చావు కబురు చల్లగా పోస్టర్‌ను అలా వాడేశారు...

హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రం 'చావు కబురు చల్లగా'. రొమాంటిక్‌ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం(మార్చి 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా... కార్తీకేయ లావణ్య త్రిపాఠిని బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్తున్న ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సినిమా ప్రమోషన్‌ కోసం రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌ను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ రోడ్ సేఫ్టీ ప్రమోషన్ కోసం వాడేశారు.

హీరో కార్తీకేయకు స్వీట్ వార్నింగ్...

హీరో కార్తీకేయకు స్వీట్ వార్నింగ్...

ఆ పోస్టర్‌లో.. బైక్ నడుపుతున్న హీరో కార్తీకేయ హెల్మెట్ ధరించలేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ... 'హెల్మెట్ పెట్టుకుని, సరిగ్గా నడిపితే ఎలాంటి కబుర్లు వినాల్సిన పని లేదు బస్తీ బాలరాజు గారు..' అంటూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం ట్వీట్ చేసింది. అంటే,హెల్మెట్ ధరించి డ్రైవ్ చేస్తే 'చావు కబురు' వినాల్సిన అవసరం ఉండదని పరోక్షంగా చెప్పారు. ఈ ట్వీట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భలే క్రియేటివ్‌గా ఆలోచిస్తున్నారంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

సినిమా టాక్ ఎలా ఉందంటే...

సినిమా టాక్ ఎలా ఉందంటే...

సినిమా విషయానికొస్తే 'చావు కబురు చల్లగా'కి డివైడ్ టాక్ వినిపిస్తోంది. కథ కొత్తగా ఉన్నప్పటికీ దాన్ని ఆసక్తికరంగా మలచడంలో డైరెక్టర్ కాస్త తడబడినట్లు చెప్తున్నారు. భర్తను కోల్పోయిన మహిళలు ఇక జీవితాంతం అదే బాధలో ఉండిపోకుండా కొత్త జీవితాన్ని ప్రారంభించాలన్న కాన్సెప్టుతో సినిమా తీసినట్లు చెప్తున్నారు. దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తన తొలి చిత్రంతోనే కొత్త కాన్సెప్టును టాలీవుడ్‌కి పరిచయం చేశాడని అంటున్నారు. జోక్స్ బిజోయ్ సంగీతం బాగుందన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా పాటల్లోని లిరిక్స్ ఆలోచింపజేసేవిగా ఉన్నాయంటున్నారు.

English summary
Cyberabad traffic police has given a sweet warning to hero Karthikeya.Traffic police used Karthikeya's movie 'chaavu kaburu challaga' poster for road safety promotion.They warned that Basti Balaraju(hero karthikeya role in movie) should wear helmet while driving bike,then there is no bad news he will hear
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X