సైకిల్ పై పోలీసుల పెట్రోలింగ్.. అక్కడ వినూత్న ప్రయోగం!!

సహజంగా పోలీస్ పెట్రోలింగ్ ఎలా జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. పోలీసులు ప్రభుత్వం తమకు కేటాయించిన వాహనాల్లో తిరుగుతూ పెట్రోలింగ్ నిర్వహిస్తారు. సమాజంలో నేరాలను నియంత్రించడం కోసం ప్రజలకు రక్షణ కల్పించడం కోసం 24 గంటలు పోలీసులు తమ వాహనాలతో పెట్రోలింగ్ చేస్తారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో జరిగే నేరాలను అరికట్టడం కోసం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుంటారు.

పోలీసులు సైకిళ్లపైన పెట్రోలింగ్
అయితే తాజాగా తెలంగాణ పోలీసులు తమకు ప్రభుత్వం కేటాయించిన వాహనాలలో కాకుండా సైకిల్ మీద పెట్రోలింగ్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు . అసలు సైకిల్స్ మీద పెట్రోలింగ్ ఎందుకు చేస్తున్నారు? ఎక్కడ చేస్తున్నారు? అనే వివరాల్లోకి వెళితే రాచకొండ సి పి సుధీర్ బాబు ఆదేశాలతో యాదాద్రి జిల్లాలో పోలీసులు సైకిళ్లపైన పెట్రోలింగ్ మొదలుపెట్టారు.

Cycle Patrolling as a part of the Visible Policing strategy in rachakonda police commissionerate

సైకిళ్లపైన వెళుతూ డ్రగ్స్ కట్టడికి అవగాహన
జిల్లా వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు సైకిళ్లపైన వెళుతూ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. పెట్రోలింగ్లో భాగంగా సైకిల్ మీద వివిధ గ్రామాలకు వెళుతూ అక్కడి యువతకు డ్రగ్స్ మరియు గంజాయి భవిష్యత్తును ఎలా పాడుచేస్తాయో చెబుతూ వాటిపైన అవగాహన కల్పిస్తున్నారు. సైకిల్ మీద పెట్రోలింగ్ చేసినట్లయితే చిన్న చిన్న గల్లీలలో కూడా వెళ్లి పెట్రోలింగ్ చేసే అవకాశం ఉంటుందని నేరాల నియంత్రణకు ఈ వినూత్ననిర్ణయం తీసుకున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు.

విజిబుల్ పోలిసింగ్ అందుకే
అయితే కార్లలో కాకుండా పోలీసులు సైకిల్ మీద రావడం పెట్రోలింగ్ నిర్వహించడం చాలా కొత్తగా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సైకిల్ మీద పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పబ్లిక్ సేఫ్టీ నేపథ్యంలో ప్రజలతో బలమైన కమ్యూనిటీ బంధాన్ని నిర్మించే క్రమంలో రాచకొండ పోలీసులు విజిబుల్ పోలీసింగ్ వ్యూహంలో భాగంగా ఈ సైకిల్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు .

సైకిల్ పై పెట్రోలింగ్ సత్ఫలితాలను ఇస్తుందా?
పెట్రోలింగ్ తో పాటు సైబర్ నేరాల పట్ల, డ్రగ్స్ పట్ల ప్రజలలో అవగాహన పెంచేందుకు ఈ సైకిల్ పెట్రోలింగ్ చేస్తున్నట్టు, సైకిళ్లపై వెళుతూ అక్కడక్కడ ప్రజలతో మాట్లాడుతూ వారికి అవగాహన కల్పిస్తున్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా పోలీసులు సైకిళ్ళ పై చేస్తున్న పెట్రోలింగ్ సత్ఫలితాలను ఇస్తుందని రాచకొండ పోలీసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+