హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పబ్లిక్ టాయిలెట్స్ కోసం సైకిల్ యాత్ర (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో ఉండే జనాభాకు సరిపడా పబ్లిక్ టాయిలెట్స్ లేకపోవడంతో సామాన్యులు తెగ ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ కామన్‌మెన్ ఫోరం వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు దోర్నాల జయప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు.

నగరంలోని పబ్లిక్ టాయిలెట్స్ సమస్యలపై గురువారం ఎల్‌బీ నగర్ నుంచి జీహెచ్‌ఎంసీ కమిషనర్ కార్యాలయం వరకు సైకిల్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ జనాభా కోట్లలో ఉండగా పబ్లిక్ టాయిలెట్స్ మాత్రం కనీసం వందల సంఖ్యలో కూడా లేవని అన్నారు.

నగరంలోని కొన్ని కమర్షియల్ కాంప్లెక్స్‌లు, రెస్టారెంట్స్‌లో మూత్ర శాలలు లేకున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. నిర్ణీత ప్రదేశాల్లో టాయిలెట్స్ లేకపోవడం వల్ల ఎక్కడపడితే అక్కడ మూత్రవిసర్జణ చేస్తున్నారని దీంతో అపరిశుభ్రత కూడా పెరిగి అంటురోగాలకు కారణం అవుతున్నాయని అన్నారు.

దీంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు.

 పబ్లిక్ టాయిలెట్స్ కోసం సైకిల్ యాత్ర

పబ్లిక్ టాయిలెట్స్ కోసం సైకిల్ యాత్ర

జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్‌ను కలసి వినతిపత్రం సమర్పించిన తెలంగాణ కామన్‌మెన్ ఫోరం వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు దోర్నాల జయప్రకాష్, కామన్‌మెన్ ఫోరం అధ్యక్షుడు వంగరి చంద్రయ్య, ఉపాధ్యక్షుడు సాయికుమార్ తదితరులు.

పబ్లిక్ టాయిలెట్స్ కోసం సైకిల్ యాత్ర

పబ్లిక్ టాయిలెట్స్ కోసం సైకిల్ యాత్ర

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో ఉండే జనాభాకు సరిపడా పబ్లిక్ టాయిలెట్స్ లేకపోవడంతో సామాన్యులు తెగ ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ కామన్‌మెన్ ఫోరం వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు దోర్నాల జయప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు.

పబ్లిక్ టాయిలెట్స్ కోసం సైకిల్ యాత్ర

పబ్లిక్ టాయిలెట్స్ కోసం సైకిల్ యాత్ర

నగరంలోని పబ్లిక్ టాయిలెట్స్ సమస్యలపై గురువారం ఎల్‌బీ నగర్ నుంచి జీహెచ్‌ఎంసీ కమిషనర్ కార్యాలయం వరకు సైకిల్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ జనాభా కోట్లలో ఉండగా పబ్లిక్ టాయిలెట్స్ మాత్రం కనీసం వందల సంఖ్యలో కూడా లేవని అన్నారు.

పబ్లిక్ టాయిలెట్స్ కోసం సైకిల్ యాత్ర

పబ్లిక్ టాయిలెట్స్ కోసం సైకిల్ యాత్ర

నగరంలోని కొన్ని కమర్షియల్ కాంప్లెక్స్‌లు, రెస్టారెంట్స్‌లో మూత్ర శాలలు లేకున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. నిర్ణీత ప్రదేశాల్లో టాయిలెట్స్ లేకపోవడం వల్ల ఎక్కడపడితే అక్కడ మూత్రవిసర్జణ చేస్తున్నారని దీంతో అపరిశుభ్రత కూడా పెరిగి అంటురోగాలకు కారణం అవుతున్నాయని అన్నారు.

English summary
cycle yatra on public toilets issue and memorandum submitted to ghmc commissioner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X