cyclone michaung: తెలంగాణ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన రేవంత్ రెడ్డి
మిచౌంగ్ తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైన చర్యలు చేపట్టాలని రేవంత్ సూచించారు.
'తెలంగాణలో పలు జిల్లాలలో తుఫాను ప్రభావంపై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. వరి ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జన జీవనానికి ఇబ్బంది కలుగకుండా చూడాలి. అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి' అని సూచించారు రేవంత్ రెడ్డి. కాగా, డిసెంబర్ 7వ తేదీన రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో సీఎస్ సమీక్ష
మిచౌంగ్ తుపాను (cyclone michaung) ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిస్తున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.. జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రెండు రోజులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. భారీ వర్షాలు, వరదలు వచ్చే ఉన్నందున ముందు చర్యలు చేపట్టాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించాలన్నారు. ఇప్పటికే పూర్తిగా నిండిన చెరువులకు గండ్లు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.

నీటిపారుదల శాఖ, విపత్తు నిర్వహణ శాఖ, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖలు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ సూచించారు. ప్రధానంగా వరదలు వచ్చే అవకాశం ఉన్న లోతట్టు ప్రాంతాల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని , అందుకు తగిన విధంగా పునరావాస కేంద్రాలను ముందుగానే గుర్తించాలని ఆదేశించారు సీఎస్ శాంతికుమారి.
తెలంగాణలో భారీ వర్షాలు
మిచౌంగ్ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాలతోపాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక, ఈ తుఫాను ప్రభావంతో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
-
హైదరాబాద్ కు మరో మణిహారం..దేశంలోనే రెండో నెట్ఫ్లిక్స్ ఆఫీస్ ప్రారంభం.. ఎప్పుడంటే! -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
ఆ జిల్లాల్లో 40డిగ్రీల ఉష్ణోగ్రతలు.. ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చిన ఐఎండీ! -
"బీరు"తో పాటు బాటిల్ లోపలే స్టఫ్.. బిత్తరపోయిన మందుబాబు !! -
విజయవాడలో పోలీసులపై గన్ తో కాల్పులు, వరంగల్ వ్యక్తి అరెస్ట్ -
కర్ణాటకలో 'రోహిత్ వేముల చట్టం'..! కుల వివక్షను అరికట్టేందుకే.. -
కేరళంలో 5 గ్యారంటీలను ప్రకటించిన రాహుల్ గాంధీ.. -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications