ముంచుకొస్తున్న మొంథా.. తెలంగాణాలో ఈ జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక!
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మొంథా తుఫానుగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల మీద ప్రభావం చూపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గడిచిన 6 గంటల్లో గంటకు 5 కి.మీ వేగంతో కదిలిన తీవ్రవాయుగుండంమరో 12 గంటల్లో నైరుతి, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడుతుందని, మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు
తెలంగాణాపై మొంథా తుఫాను ప్రభావం
ప్రస్తుతానికి చెన్నైకి 770 కి.మీ, విశాఖపట్నంకి 820 కి.మీ, కాకినాడకి 810 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం కారణంగా పలు జిల్లాలలో అత్యంత భారీవర్షాలు కురుస్తాయన్నారు. మొంథా తుఫానుతో తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది . వాయుగుండం తీరం దాటితే తెలంగాణలోని పలు ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

తెలంగాణా వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు
28వ తేదీ తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని, 29, 30తేదీలలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలంగాణలోని పలు ప్రాంతాలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
నేడు, రేపు ఈ జిల్లాలలో భారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలోని కొమురం భీం ఆసిఫాబాద్, అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలో అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.రేపు రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని, కొమురం భీం ఆసిఫాబాద్, అదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, నాగర్ కర్నూలు జిల్లాలలో భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది.
28 నుండి 31వ తేదీ వరకు భారీ వర్షాలే
28వ తేదీన తెలంగాణలోని ఈశాన్య జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది. 28వ తేదీన ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక అక్టోబర్ 29వ తేదీన 9 జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 31వ తేదీని కూడా పది జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మొత్తం ఐదు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.












Click it and Unblock the Notifications