Cyclone Tauktae:సూర్యాపేటలో ఘోరం -పిడుగుపాటుకు ఇద్దరు బలి -తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు
అరేబియా సముద్రంలో ఏర్పడిన 'తౌక్తే' తుపాను ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాభావ పరిస్థితితులు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో శనివారం రాత్రి నుంచే వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం నాటికి ఇంకొన్ని జిల్లాల్లో వర్షాలు విస్తరించాయి. కొన్ని చోట్ల విషాదకర సంఘటనలు చోటుచేసుకున్నాయి...
Recommended Video
తౌక్తే తుపాను కారణంగా సూర్యాపేట జిల్లాలోని నూతన్‌కల్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని లింగంపల్లిలో పిడుగుపాటుకు ఇద్దరు మృతిచెందారు. గ్రామంలోని పొలంలో మిరపకాయలు ఏరుతుండగా కూలీల సమీపంలో పిడుగు పడింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. మరోవైపు..

తౌక్తే ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లోనూ వర్షం కురస్తోంది. కృష్ణాజిల్లా గన్నవరంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. 'తౌక్తే' తుపాను వాయుగుండంగా మారడంతో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే..
తుపాను కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో పలు రైలు స్వీసులు నిలిచిపోయాయి. గుజరాత్ వెళ్లాల్సిన పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) రద్దుచేసింది. తుఫాను ప్రభావంతో గుజరాత్ కోస్తా తీరంలో ఏర్పడిన పరిస్థుల వల్ల ఆరు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు.
ఆదివారం నడవాల్సిన పూరి-ఓఖా ఎక్స్‌ప్రెస్, 17న నడిచే రాజ్‌కోట్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌లు, 18న నడిచే పోరుబందర్-సికింద్రాబాద్, 19న బయలుదేరే ఓఖా-పూరి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-పోరుబందర్ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 18న నడవాల్సిన ఓఖా-రామేశ్వరం రైలును పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే వెల్లడించారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications