టీఆర్ఎస్‌కు షాక్: ట్విస్టిచ్చిన డీఎస్! కాంగ్రెస్‌లో చేరిన నర్సారెడ్డి, రాములు నాయక్
Recommended Video

న్యూఢిల్లీ: తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై సీనియర్ రాజకీయ నాయకుడు డీ శ్రీనివాస్ మరో ట్విస్ట్ ఇచ్చారు. శనివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో డీఎస్ భేటీ అయ్యారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

రాహుల్‌తో భేటీపై డీఎస్
అయితే, భేటీ అనంతరం డీఎస్ మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవడానికి సమయం అడిగానని చెప్పారు. తనకు రాహుల్ సమయం ఇచ్చారని.. ఆయనను కలిశానని తెలిపారు. అయితే రాహుల్‌తో ఏం మాట్లాడానో మీతో చెప్పాల్సిన పనిలేదని ఆయన మీడియానుద్దేశించి అన్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పానా?
తాను చాలా మంది నేతలను గతంలో కలిశానని, కలుస్తూనే ఉంటానని డీ శ్రీనివాస్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో చేరానని మీకు ఎవరు చెప్పారని ఆయన ప్రశ్నించడం గమనార్హం. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన నర్సారెడ్డి, రాములు నాయక్
కాగా, గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు టీ నర్సారెడ్డి, ఎమ్మెల్సీ రాములు నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో శనివారం రాహుల్ గాంధీ సమక్షంలో వీరు కాంగ్రెస్ కండువాలు కప్పుకొన్నారు. అయితే వీరితోపాటు డీఎస్ కూడా కాంగ్రెస్‌లో చేరినట్లు వచ్చినా.. డీఎస్ స్పందన మాత్రం మరోలా ఉంది.

అందుకే కాంగ్రెస్ పార్టీలోకి..
బంగారు తెలంగాణ సాధిస్తామన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ దిశగా ఎలాంటి కార్యక్రమాలు చేయడం లేదని కాంగ్రెస్ పార్టీలో చేరిన నర్సారెడ్డి అన్నారు. కేసీఆర్‌ను ఓడించేందుకే తాము కాంగ్రెస్ పార్టీలో చేరామని చెప్పారు. బంగారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications