సూరేపల్లి సుజాత టార్గెట్: వివాదం, ఆసలేం జరిగింది?

Posted By:
Subscribe to Oneindia Telugu

కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో దళిత బహుజనులకు, మితవాద గ్రూపులకు మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. గత వారం రోజులుగా భావ ప్రకటనా స్వేచ్ఛ, అస్తిత్వం, జాతీయత అనే అంశాలపై వివాదం చెలరేగుతూ వస్తోంది.

ఆ వివాదంలో మితవాదులు ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతను లక్ష్యంగా చేసుకున్నారు. గత నెల 25వ తేదీన కొంత మంది బహుజ విద్యార్థి పరిషత్‌కు చెందిన దళిత విద్యార్థులు శాతవాహన విశ్వవిద్యాలయం వెలుపల మనుస్మృతి అని రాసి ఉన్న పేపర్‌ను దగ్ధం చేశారు.

 అదే సమయంలో బిజెపి కార్యకర్తలు..

అదే సమయంలో బిజెపి కార్యకర్తలు..

దహన దినంగా పరిగణిస్తూ దళితులు సంకేతంగా మనుస్మృతి అని రాసి ఉన్న కాగితాన్ని తగులబెట్టారు. అదే సమయంలో బిజెపి కార్యకర్లు అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదినం సందర్భంగా ర్యాలీ తీశారు. రెండు గ్రూపులకు మధ్య యూనివర్శిటి వెలుపల ఘర్షణ చెలరేగింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.

 వారి ప్రచారం ఇలా..

వారి ప్రచారం ఇలా..

బహుజన కార్యకర్తలు భారత మాత హోర్డింగ్‌ను దగ్ధంం చేశారని బిజెపి కార్యకర్లలు ప్రచారం చేయడం ప్రారంభించారు. అయితే, తాము అలా చేయలేదని దళితులు చెప్పినా వారు వినలేదు. పోలీసులు ఇరు వర్గాలవారినీ అరెస్టు చేశారు.

సూరేపల్లి సుజాత టార్గెట్

సూరేపల్లి సుజాత టార్గెట్

బిజెపి కార్యకర్తలు శాతవాహన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతను లక్ష్యం చేసుకుని ప్రచారం ప్రారంభించారు. ఆన్‌లైన్‌లో ఆమెపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ప్రచారం సాగించారు. ఆ సమయంలో తాను యూనివర్శిటీలో లేనని, హైదరాబాదులో ఉన్నానని చెప్పినా వారు పట్టించుకోలేదు.

 ఆమె పోస్టు...

ఆమె పోస్టు...

దళితులపై ఆర్ఎస్ఎస్, బిజెపి వాళ్లు దాడి చేశారని సూరేపల్లి సుజాత ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టారు. దాని కొద్ది సమయంలోనే వైరల్‌గా మారింది. సూరేపల్లి సుజాత దళితుల పక్షాన నిలబడుతూ వివిధ సమస్యలపై పెద్ద యెత్తున గళమెత్తుతున్నారు. నేరెళ్ల ఘటనపై, తదితర ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నారు

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Right wing activist made Satavhana University proffessor Surepally Sujatha.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X