స్మితా సబర్వాల్‌కు దానం నాగేందర్ సపోర్ట్! కేసీఆర్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఓ పోస్టును రీట్వీట్ చేసి పోలీసుల విచారణను ఎదుర్కొన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంఘీభావం తెలిపారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఆమెపై కొందరు కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తుండగా.. దానం నాగేందర్ మద్దతు పలకడం చర్చనీయాంశంగా మారింది.
స్మతా సబర్వాల్ సోషల్ మీడియాలో రీట్వీట్ చేసిన విషయంలో తప్పేమీ లేదన్నారు దానం నాగేందర్. ఆమె అక్కడి వాస్తవ పరిస్థితినే ప్రజలతో పంచుకున్నారని అన్నారు. ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వంను ఉద్దేశించి ఆమె ఏమీ అనలేదన్నారు. సదరు అధికారిణిపై విమర్శలు అనవసరమని దానంగా నాగేందర్ స్పష్టం చేశారు. మరోవైపు, కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సీఎస్ శాంతి కుమారి అవమానానికి గురయ్యారని అన్నారు. ఆమె ఉద్యోగ జీవితంలో ఇప్పటి వరకు ఎలాంటి రీమార్క్ లేదని చెప్పారు.

మరోవైపు, మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్)పై దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించనున్న సిల్వర్ జూబ్లీ మహాసభపై దానం స్పందించారు. ఏప్రిల్ 27న వరంగల్‌లో జరగనున్న బీఆర్ఎస్ మహాసభ విజయవంతమవుతుందన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో జరిగే ఈ సభకు ప్రజలు భారీగా హాజరవుతారని దానం నాగేందర్ చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ను చూసేందుకు, ఆయన ఏం మాట్లాడతారన్న విషయంపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని దానం నాగేందర్ అన్నారు. కాగా, బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఇప్పటికే ఆ పార్టీ నేతలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. లక్షలాదిగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇది ఇలావుండగా కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో స్మితా సబర్వాల్‌పై కొందరు కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. వాటికి ఆమె కూడా బదులిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో భావాన్ని ప్రకటించే హక్కు కూడా లేదా? అని ప్రశ్నిస్తున్నారు. 2వేల మంది ఆ ట్వీట్ ను రీట్వీట్ చేస్తే.. తనపైన మాత్రమే చర్యలు ఎందుకు తీసుకొంటున్నారని ప్రశ్నిస్తున్నారు.
స్మితా సబర్వాలపై మరో నేత గరం గరం!
హైదరాబాద్ కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి ఓ చిత్రాన్ని ఎక్స్ వేదికగా రీట్వీట్ చేయడంతో వివాదం ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌ను వీడటం లేదు. ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించిన కొందరు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరికొందరు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. పోలీసులు నోటీసులు జారీ చేయడంతో వారి ఎదుట హాజరై విచారణకు సహకరించినట్లు స్మితా సబర్వాల్ వెల్లడించిన విషయం తెలిసిందే.
తాజాగా, స్మితా సబర్వాల్‌పై మరో కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతున్నారని స్మితా సబర్వాల్ ను ప్రశ్నించారు కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం. అంతేగాక, ఆమెపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'ఆమె ఏం యాక్షన్ చేస్తుందబ్బా.. ఆమె ఐఏఎస్ అధికారిణి' అని ఆయన వ్యంగ్యంగా స్పందించారు.
కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సోషల్ మీడియా రీట్వీట్లను ఆయన ప్రస్తావించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాటి ప్రభుత్వ నిర్ణయాలను ఎందుకు ప్రశ్నించలేదన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో 13 లక్షల చెట్లను నరికిందని గజ్జెల కాంతం ఆరోపించారు. ఆ చెట్లను నరికి వేసినప్పుడు స్మితా సబర్వాల్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదని ఆయన నిలదీశారు. సోషల్ మీడియా పోస్టులు ఎందుకు పెట్టలేదని గజ్జెల కాంతం ప్రశ్నించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications