పెంపుడు కుక్కలు: కడియంపై మందకృష్ణ, రాళ్లతో కొడతాం: శ్రీనివాస్
హైదరాబాద్: రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో దండోరా సభ జరిగింది. ఈ సభ విషయమై ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, తెలంగాణ ఎమ్మార్పీఎస్ నేతలు యాతాకుల భాస్కర్, వంగపల్లి శ్రీనివాస్‌ల మధ్య ఆదివారం మాటల యుద్ధానికి తెరలేపింది.
మందకృష్ణ మాట్లాడుతూ... హైదరాబాదులో పెంపుడు కుక్కలతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌లు దండోరా సభ పెట్టించారని ఎద్దేవా చేశారు. కోట్ల రూపాయల సొంత డబ్బుతోనే సభ పెట్టించారని, అది మాదిగ జాతిని మోసం చేయడమేనని ఆరోపించారు.
దొరల పాలెర్లతో సమావేశం పెట్టిస్తే కెసిఆర్‌కు చాలా ఉపయోగ పడుతుందని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ పైన అఖిల పక్షానని ఢిల్లీకి తీసుకు వెళ్తానని చెప్పిన కడియం.. దళితుల్ని మోసం చేశారన్నారు. కెసిఆర్‌కు కడియం, ఈటెలలు పాలెర్లలా వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దళిత జాతిలో గౌరవం కోల్పోయిన వ్యక్తి కడియం అని, దళితుల గౌరవాన్ని కెసిఆర్ కాళ్ల దగ్గర పకట్టు పెట్టారన్నారు. దళిత రక్తం ఉండి ఉంటే డిఎన్ఏ పరీక్షలు చేయించుకోవాలని, అప్పుడు దళితుడివో కాదో రుజువు అవుతుందని ఎద్దేవా చేశారు. ఈటెలకు దళితుల పైన ప్రేమ లేదని, ఉన్నది ద్వేషమే అన్నారు.

మందకృష్ణకు కౌంటర్
మందకృష్ణ మాదిగ వ్యాఖ్యల పైన యాతాకుల భాస్కర్, వంగపల్లి శ్రీనివాస్‌లు ధీటుగా స్పందించారు. మందకృష్ణ మాదిగ నాలుక కోస్తామని హెచ్చరించారు. రాళ్లతో కొడతామని, మాదిగ వాడల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. కడియం, ఈటెలలను విమర్శించే నైతిక హక్కు మందకృష్ణకు లేదన్నారు. వెంటనే ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.
కెసిఆర్.. మందకృష్ణను దగ్గరకు రానివ్వకపోవడంతో తెలంగాణలో తన చరిత్ర ముగిసిందన్న అవమానంతో అసంబద్ద మాటలు మాట్లాడుతున్నారన్నారు. దండోరా మహాసభకు లక్షలాది మంది డప్పుతో హాజరైతే వారంతా మాదిగలు కారని ఎలా మాట్లాడతారన్నారు. టీఎంఆర్పీఎస్ పోరాటం వల్లే మాదిగ విద్యార్థులు విదేశీ చదువుల స్కాలర్ షిప్పులను రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ప్రభుత్వం పెంచిందన్నారు.












Click it and Unblock the Notifications