హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దర్భంగా పేలుడు కేసు: హైదరాబాద్‌లో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదుల అరెస్ట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బీహార్ రాష్ట్రంలోని దర్బంగా రైల్వే స్టేషన్లో జూన్ 17న జరిగిన పేలుడు ఘటనకు సంబంధించిన కేసులో హైదరాబాద్ నగరానికి చెందిన ఇద్దరిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. హైదరాబాద్ నాంపల్లికి చెందిన ఇమ్రాన్ ఖాన్, నాసిర్ ఖాన్‌ అనే ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంది.

ఈ సందర్భంగా ఎన్ఐఏ తెలిపిన వివరాల ప్రకారం.. ఇమ్రాన్ ఖాన్, నసీర్ ఖాన్ లష్కరే తొయిబా ఉగ్రవాదులు. దర్బంగా రైల్వే స్టేషన్లో జూన్ 17న పార్శిల్ బాంబు పేలుడు సంభవించింది. సికింద్రాబాద్ నుంచి ఆ పార్శిల్ వెళ్లినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. దేశ వ్యాప్తంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగేాలా లష్కరే తొయిబా కుట్ర పన్నిందని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.

Darbhanga station blast case: NIA arrests two Lashkar-e-Taiba terrorists in Hyderabad

2012లో నాసిర్ ఖాన్ పాకిస్థాన్ వెళ్లి ఎల్ఈటీలో శిక్షణ పొందాడని, రసాయనాలతో ఐఈడీ తయారు చేయడంలో శిక్షణ తీసుకున్నాడని చెప్పారు. తిరిగి భారత్ వచ్చిన తర్వాత సోదరుడు ఇమ్రాన్‌తో కలిసి ఐఈడీ తయారు చేశాడు. వస్త్రాల్లో ఐఈడీ పెట్టి సికింద్రాబాద్-దర్బంగా రైళ్లో పార్శిల్ పంపారు.

రైలులోనే పేలి మంటలు వ్యాపించి అధిక ప్రాణ నష్టం జరిగేలా కుట్ర పన్నారు. నాసిర్, ఇమ్రాన్ తరచూ లష్కరే తొయిబా ఉగ్రవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులు ఇమ్రాన్, నాసిర్‌లను అధికారులు విచారిస్తున్నారు. ఇంకా ఏమైనా పేలుళ్లకు కుట్ర పన్నారా? అనే వివరాలను తెలుసుకునేందుకు నిందితులను విచారిస్తున్నారు.

English summary
Darbhanga station blast case: NIA arrests two Lashkar-e-Taiba terrorists in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X