వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎంలతో దాసరికి ప్రత్యేక అనుబంధం: 'మోహన్ బాబే పరిచయం చేశారు'

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావులకు దర్శకులు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణ రావుతో ప్రత్యేక అనుబంధం ఉంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావులకు దర్శకులు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణ రావుతో ప్రత్యేక అనుబంధం ఉంది.

దటీజ్ దాసరి: అందుకోసం చిరంజీవితోనూ కలిశారు!దటీజ్ దాసరి: అందుకోసం చిరంజీవితోనూ కలిశారు!

దాసరిని వీరు రాజకీయాలకు అతీతంగా అభిమానించారు. చంద్రబాబు నాయుడు అంటే జన్మభూమి గుర్తుకు వస్తుంది. ఆ జన్మభూమికి దాసరి పాటలు రాయడం విశేషం.

దాసరితో అనుబంధం

దాసరితో అనుబంధం

దాసరి ప్రాంతాలకు అతీతమైన వ్యక్తి అని, ఆయన యూనివర్సల్ వ్యక్తి అని గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత దాసరి సినీ పరిశ్రమ విడిపోకుండా దిశానిర్దేశనం చేశారు. పరిశ్రమకు రెండు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్లు అని దాసరి చెప్పేవారు.

మోహన్ బాబు ద్వారా చంద్రబాబుకు పరిచయం

మోహన్ బాబు ద్వారా చంద్రబాబుకు పరిచయం

దాసరి తనకు చిన్నప్పట్నుంచీ తెలుసునని చంద్రబాబు కూడా చెప్పిన విషయం తెలిసిందే. మోహన్ బాబు ద్వారా పరిచయమైనట్లు తెలిపారు. తమ కుటుంబంతో ఆయనకు చాలా సాన్నిహిత్యం ఉందన్నారు. సొంత కుటుంబసభ్యుడిగా చూసుకునే వారన్నారు.

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి

కాగా, దాసరి నారాయణ రావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. మొయినాబాద్‌ మండలం తోల్కట్ట వ్యవసాయ క్షేత్రంలో ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రముఖులు, అభిమానుల అశ్రునయనాల మధ్య దాసరి సతీమణి పద్మ సమాధి పక్కనే ఆయన అంత్యక్రియల్ని పూర్తి చేశారు.

రాహుల్ గాంధీ ట్వీట్

రాహుల్ గాంధీ ట్వీట్

దాసరి మృతితో తెలుగు చలన చిత్ర పరిశ్రమ బలమైన నేతను కోల్పోయిందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. అతన్ని కోల్పోవడం విచారకరమని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.

నేను అంటే అభిమానమని గంటా

నేను అంటే అభిమానమని గంటా

దాసరి ఆకస్మిక మరణం షాక్‌కు గురి చేసిందని, సినీ పరిశ్రమలో అన్ని విభాగాలపై పట్టున్న విలక్షణ వ్యక్తి ఆయన అని, సినీ రంగం పెద్దదిక్కును కోల్పోయిందని మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు.

ఆసుపత్రిలో చేరే రెండురోజుల ముందు కూడా ఆయన తనకు ఫోన్‌ చేసి మాట్లాడారని, తాను అంటే ఆయనకు ప్రత్యేక అభిమానమని, దాసరి మృతిపట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని గంటా అన్నారు.

 రాజకీయాల్లోను తనదైన పాత్ర

రాజకీయాల్లోను తనదైన పాత్ర

దాసరి సినీ రంగానికి చెందిన వ్యక్తి మాత్రమే కాదని, రాజకీయాల్లోనూ తనదైన పాత్ర పోషించారని వైసిపి నేత అంబటి రాంబాబు అన్నారు. ఈ మధ్యకాలంలో ఆయనతో తనతో మంచి అనుబంధం ఏర్పడిందన్నారు. ఆయన మృతి సినీ, రాజకీయ రంగాలకు తీరని లోటు అన్నారు.

English summary
Dasari Narayana Rao cremated with full state honours, Telugu film industry mourns death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X