బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్
తెలంగాణలో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరును ప్రకటించింది. ఈ మేరకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఉదయం దాసోజు శ్రవణ్ నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కేసీఆర్ ఆదేశించారు.
కాగా, రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఆయా స్థానాలకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. 10వ తేదీ వరకు నామినేషన్లకు అవకాశం కల్పించింది. నామినేషన్ల విత్‌డ్రాకు 13 వరకు అవకాశం ఉంది. 20న ఎన్నికలు జరగనుండగా అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి.

ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా మూడు కాంగ్రెస్‌కు, ఒకటి బీఆర్‌ఎస్‌కు వస్తాయి. ఐదో స్థానం కోసం కాంగ్రెస్‌కు ఎంఐఎంతో పాటు మరికొన్ని ఓట్లు అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది.
విజయశాంతి సహా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతితోపాటు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్‌లను కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించింది. ఇప్పటికే ఓ సీటును సీపీఐకి కాంగ్రెస్ ఇచ్చింది. కాగా, అధిష్టానం కోటాలో విజయశాంతికి టికెట్ వచ్చినట్లు తెలుస్తోంది.
విజయశాంతి పేరు ఊహించని విధంగా తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. పార్టీలో చేరిన సమయంలోనే ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విజయశాంతిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇక, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించారు. అయితే, శంకర్ నాయక్ పేరు ఎవరు ప్రస్తావించకపోయినప్పటికీ.. ఆయనకు టికెట్ రావడం కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంలో చర్చనీయాంశంగా మారింది.
కాగా, కాంగ్రెస్ రాష్ట్ర కొత్త ఇంచార్జి మీనాక్షి నటరాజన్ తనదైన స్టైల్‌లో అభ్యర్థుల ఎంపిక చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. పార్టీ కోసం పనిచేసినవారికి, పార్టీలో పాత నేతలకు ప్రాధాన్యత ఉంటుందని ఇప్పటికే మీనాక్షి నటరాజన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎవరూ ఊహించని విధంగా విజయశాంతి, శంకర్ నాయక్ పేర్లు తెరపైకి రావడం గమనార్హం. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో అద్దంకి దయాకర్ మాల సామాజిక వర్గ నేతకు ప్రాధాన్యత లభించింది.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications