వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దత్తాత్రేయకు అవమానం: ఆ ఏసీపీపై వేటు

ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా ఆలయానికి వచ్చిన కేంద్రమంత్రి దత్తాత్రేయ వాహనాన్ని అడ్డుకున్న విషయం తెలిసిందే.ఇందుకు బాధ్యుడ్ని చేస్తూ గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావుపై వేటు పడింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా ఆలయానికి వచ్చిన కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ వాహనాన్ని అడ్డుకున్న గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావుపై వేటు పడింది. ఆయన్ని డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

దత్తాత్రేయకు అవమానం: కవిత, అధికార పార్టీ నేతలను ఆపలేదు, విమర్శలుదత్తాత్రేయకు అవమానం: కవిత, అధికార పార్టీ నేతలను ఆపలేదు, విమర్శలు

జులై 9న మహంకాళి అమ్మవారి దర్శనానికి కుటుంబసమేతంగా వచ్చిన దత్తాత్రేయ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఏసీపీ శ్రీనివాసరావు ఆలయానికి కొద్దిదూరం ముందే నిలిపివేశారు. తన సతీమణికి హృద్రోగ సమస్య ఉందని, ఆమె నడవలేదని దత్తాత్రేయ చెప్పినా ఆయన వినిపించుకోలేదు.

దీంతో చేసేందేమీ లేక కేంద్రమంత్రి వాహనం దిగి నడుచుకుంటూ ఆలయానికి చేరుకున్నారు. దీనిపై విమర్శలు రావడంతో హైదరాబాద్‌ పోలీసు కమిషన్‌ మహేందర్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. విచారణ జరిపిన అనంతరం గోపాలపురం ఏసీపీని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ బుధవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు.

English summary
Gopalapuram ACP Srinivasa Rao has been eliminated due to stopping union minister Bandaru Dattatreya's vehicle at Mahankali Temple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X