మోడీ-కెసిఆర్‌లే చెప్పాలి: దత్తాత్రేయ, కేంద్రానికి మద్దతిస్తాంకానీ: కవిత

హైదరాబాద్: కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి చేరుతుందా లేదా అనే విషయాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ప్రధాని నరేంద్ర మోడీలే చెప్పాలని కేంద్రమంత్రి, బిజెపి నేత బండారు దత్తాత్రేయ సోమవారం నాడు అన్నారు.

కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి చేరుతుందా అని విలేకరులు దత్తాత్రేయను ప్రశ్నించారు. దీనిపై దత్తాత్రేయ స్పందించారు. దానిపై ప్రధాని, ముఖ్యమంత్రులో సమాధానం చెప్పాలన్నారు. ఆర్థిక ప్యాకేజీ పైన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

సమదూరం ఉంటాం: కవిత

తాము అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలకు సమాన దూరంలో ఉంటామని నిజామాబాద్ ఎంపీ, టిఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత వేరుగా చెప్పారు. తాము కేంద్ర ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతు పలుకుతామని ఆమె స్పష్టం చేశారు.

ప్రజలకు మేలు చేసే అంశంలో తాము కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మద్దతు పలుకుతామని చెప్పారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మేలు జరుగుతుందని తాము భావిస్తున్నామన్నారు. రైల్వే బడ్జెట్లో కూడా తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె అన్నారు. పునర్విభజన చట్టంలోని హామీల అమలుకు తాము పట్టుబడతామన్నారు.

Dattatreya responds on TRS support for NDA, Kavitha says equal distance from NDA and UPA

చంద్రబాబుకు తెలంగాణలో అండగా నిలబడింది మేమే: మందకృష్ణ

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ పైన తీర్మానం చేసి అఖిల పక్షం ద్వారా పార్లమెంటుకు పంపించాలని, లేదంటే పది లక్షల మందితో విజయవాడలో మాదిగర విశ్వరూప మహాసభను నిర్వహిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు.

ఎస్సీ వర్గీకరణ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టడం వల్లే సీఎం చంద్రబాబుకు మాదిగలు అండగా నిలిచారని చెప్పారు. తెలంగాణలో పాదయాత్ర సమయంలో తెలంగాణలో చంద్రబాబును నడిపించామని, ఎన్నికల సమయంలో ఆంధ్రాలో గెలిపించామని చెప్పారు.

మాదిగలు ఇంత చేసినా చంద్రబాబు మాత్రం తమ సామాజిక వర్గాన్ని విస్మరిస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలన్నారు. అఖిల పక్షాన్ని ఏఅర్పాటు చేసి పార్లమెంటుకు పంపాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+