'తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా': విచారణలో ఐబొమ్మ రవి ఆన్సర్ ఇదే..!

ఐబొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమంది రవి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే రెండు రోజుల కస్టడీలో కీలక విషయాలను రాబట్టారు అధికారులు. అయితే ఇవాళ మూడో రోజు కస్టడీలో భాగంగా అధికారులు అతడ్ని విచారించారు. అయితే ఐబొమ్మ రవి అధికారులకు ఏమాత్రం సహకరించలేదని తెలుస్తోంది. మూడోరోజు విచారణలో భాగంగా ఇవాళ ఏకంగా సీపీ సజ్జనార్ రవిపై ప్రశ్నలు కురిపించారు. అయితే వాటికి పొంతనలేని సమాధానం చెప్పినట్లు స్పష్టం అవుతోంది.

ఐబొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమంది రవి కేసులో పోలీసుల కస్టడీ మూడో రోజు ముగిసింది. మూడోరోజు విచారణలో భాగంగా ఇవాళ ఇమంది రవిని ఏకంగా సీపీ సజ్జనార్ ప్రశ్నించారు. సైబర్ క్రైమ్ ఆఫీస్ లో రవిని సజ్జనార్ విచారించారు. అయితే విచారణలో రవి పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు అడిషినల్ సీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు. యూజర్ ఐడీ, పాస్ వర్డ్ అడిగితే.. గుర్తు లేదు, మర్చిపోయా అని సమాధానం చెప్పినట్లు తెలిపారు. బ్యాంకు ఖాతాలపైనా రవి ఎలాంటి సమాధానం చెప్పలేదన్నారు. ఈ నేపథ్యంలో ఎథికల్‌ హ్యాకర్ల సాయంతో హార్డ్‌ డిస్క్‌ లు, పెన్‌ డ్రైవ్‌ లు ఓపెన్‌ చేస్తున్నట్లు తెలిపారు.

Day 3 Shocker CP Sajjanar Grills Ibomma Ravi Servers in Europe Exposed

ఇక ఐ బొమ్మ రవి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రతి 20 రోజులకు విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసేవాడని గుర్తించారు. అయితే తనకు విదేశాలకు వెళ్లడం ఇష్టం అని రవి.. పోలీసులకు చెప్పినట్లు సమాచారం. వచ్చిన డబ్బులను ఎప్పటికప్పుడు ఖర్చు చేసేవాడు.. ఐబొమ్మ రవి తన స్నేహితుడు నిఖిల్, అతని సోదరికి పలుమార్లు నగదు లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఐదు రోజుల కస్టడీలో భాగంగా మూడో రోజు విచారణకు ఐబొమ్మ రవి ఏమాత్రం సహకరించలేదని పోలీసులు చెబుతున్నారు. యూజర్ ఐడీ, పాస్ వర్డ్ అడిగితే గుర్తులేదు.. మర్చిపోయానని చెబుతున్నాడు. హర్డ్ డిస్క్, పెన్ డ్రైవ్ పాస్ కోడ్ లను ఎథికల్ హ్యాకర్స్ సాయంతో ఓపెన్ చేస్తున్నారు పోలీసులు. అలాగే రవికి ఫ్రాన్స్, నెథర్లాండ్స్ దేశాల్లో మెయిన్ సర్వర్లు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+