హైదరాబాద్‌లో ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్న DAZN: భారీగా ఉద్యోగాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ యూకే(బ్రిటన్)లో పర్యటిస్తున్నారు. కేటీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం యూకేలో రెండో రోజు శనివారం పలు సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. శనివారం భారీ పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
స్పోర్ట్స్ లైవ్ స్ట్రీమింగ్‌లో గ్లోబల్ లీడర్ అయిన డీఏజడ్ఎన్(DAZN) సంస్థ హైదరాబాద్‌లో తమ ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడితో తెలంగాణలో 1000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

లండన్‌లో కేటీఆర్, DAZN గ్రూప్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సందీప్ టీకు మధ్య జరిగిన సమావేశం తర్వాత ఈ ప్రకటన చేశారు. ఇన్నోవేషన్, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌లో తెలంగాణకు పెరుగుతున్న ఉనికికి DAZN పెట్టుబడి నిదర్శనమన్నారు మంత్రి కేటీఆర్.
ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ అండ్ ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ డైరెక్టర్ కొణతం దిలీప్, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్‌నాథ్‌రెడ్డి ఆత్మకూరి తదితరులు పాల్గొన్నారు.
టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్న లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్
హైదరాబాద్‌లో అత్యాధునిక సాంకేతిక కేంద్రాన్ని(టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) ఏర్పాటు చేసేందుకు లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ముందుకొచ్చింది.ఈ సెంటర్ ఏర్పాటు ద్వారా సుమారు 1000 మందిని ఈ సంవత్సరానికి నియమించుకోనున్నట్లు సంస్థ తెలిపింది.
మంత్రి కేటీఆర్‌తో లండన్‌లో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ సీఈవో అంథోనీ మెక్‌కార్టీ ప్రకటించారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో దీనికి సంబంధించిన పరస్పర అవగాహన ఒప్పందాన్ని పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిలతో ఆంతోనీ మెక్ కార్టీ కుదుర్చుకున్నారు.
తెలంగాణలో ఈ సంస్థ టెక్నాలజీ సెంటర్‌ను నెలకొల్పడం ద్వారా హైదరాబాద్ నగరంలోని బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్య్సూరెన్స్ రంగాలకు అద్భుతమైన ఊతం లభిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆయా రంగాల్లో మరిన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగనున్నాయని మంత్రి వెల్లడించారు. లండన్ స్టాక్ ఎక్చ్సేంచ్ గ్రూప్ దాదాపు 190 దేశాల్లో ఖాతాదారులకు సేవలు అందిస్తోంది. తన విస్తృతమైన కార్యకలాపాలతో ప్రపంచంలోని ఫైనాన్షియల్ సేవా రంగంలో దిగ్గజ సంస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications