హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉప్పల్ కార్డన్ సెర్చ్: ఆపరేషన్ చిలుకానగర్(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ ప్రాంతంలోని చిలుకానగర్ లక్ష్యంగా సైబరాబాద్ పోలీసులు గురువారం కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఇళ్లల్లో అణువణువు గాలించారు. అనుమానితులను, పాత నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. వ్యక్తులతో పాటు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

మాల్కాజిగిరి డీసీపీ రమారాజేశ్వరీ సమక్షంలో ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. చిలుకానగర్‌లో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు నివాసం ఉంటారు. వీరంతా ఉప్పల్, నాచారం, మల్లాపూర్, చర్లపల్లి, తదితర పారిశ్రామికవాడల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు.

చిలుకానగర్‌లో సంఘ విద్రోహక శక్తులు కూడా ఉంటున్నాయనే విమర్శలు ఉన్నాయి. దీంతో బుధవారం అర్ధరాత్రి దాటాక ఆపరేషన్ చేపట్టారు. డీసీపీతో పాటు 5 గురు ఏసీపీలు, సుమారు 360 మంది పోలీసులు మూకుమ్మడిగా చిలుకానగర్‌లో తనిఖీలు చేశారు.

వీరిలో 6 ఓటర్ కార్డన్ టీములు, 4 ఇన్నర్ కార్డన్ టీములు, మరో 19 సెర్చ్ టీములు పాల్గొన్నాయి. కాలనీలోని 19 లైన్లల్లో 3వేల ఇళ్లల్లో గాలించినట్లుగా పోలీసులు తెలిపారు. కార్డన్ అండ్ సెర్చ్ వివరాలను డీసీపీ రమారాజేశ్వరీ వెల్లడించారు. 15 మంది అనుమానితులను, మరో 12 మంది పాత నేరస్తులను అదుుపలోకి తీసుకున్నట్లు తెలిపారు. దీంతో పాటు 44 ద్విచక్ర వాహనాలు, 15 ఆటోలు, 4 కార్లు, 9 గ్యాస్ సిలిండర్లు, కట్టర్లు స్వాధీనం చేసుకున్నారు.

 ఉప్పల్ ప్రాంతంలో కార్డన్ సెర్చ్

ఉప్పల్ ప్రాంతంలో కార్డన్ సెర్చ్

నగరంలోని ఉప్పల్ ప్రాంతంలోని చిలుకానగర్ లక్ష్యంగా సైబరాబాద్ పోలీసులు గురువారం కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఇళ్లల్లో అణువణువు గాలించారు. అనుమానితులను, పాత నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. వ్యక్తులతో పాటు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

 ఉప్పల్ ప్రాంతంలో కార్డన్ సెర్చ్

ఉప్పల్ ప్రాంతంలో కార్డన్ సెర్చ్

మాల్కాజిగిరి డీసీపీ రమారాజేశ్వరీ సమక్షంలో ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. చిలుకానగర్‌లో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు నివాసం ఉంటారు. వీరంతా ఉప్పల్, నాచారం, మల్లాపూర్, చర్లపల్లి, తదితర పారిశ్రామికవాడల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు.

ఉప్పల్ ప్రాంతంలో కార్డన్ సెర్చ్

ఉప్పల్ ప్రాంతంలో కార్డన్ సెర్చ్

చిలుకానగర్‌లో సంఘ విద్రోహక శక్తులు కూడా ఉంటున్నాయనే విమర్శలు ఉన్నాయి. దీంతో బుధవారం అర్ధరాత్రి దాటాక ఆపరేషన్ చేపట్టారు. డీసీపీతో పాటు 5 గురు ఏసీపీలు, సుమారు 360 మంది పోలీసులు మూకుమ్మడిగా చిలుకానగర్‌లో తనిఖీలు చేశారు.

 ఉప్పల్ ప్రాంతంలో కార్డన్ సెర్చ్

ఉప్పల్ ప్రాంతంలో కార్డన్ సెర్చ్

వీరిలో 6 ఓటర్ కార్డన్ టీములు, 4 ఇన్నర్ కార్డన్ టీములు, మరో 19 సెర్చ్ టీములు పాల్గొన్నాయి. కాలనీలోని 19 లైన్లల్లో 3వేల ఇళ్లల్లో గాలించినట్లుగా పోలీసులు తెలిపారు. కార్డన్ అండ్ సెర్చ్ వివరాలను డీసీపీ రమారాజేశ్వరీ వెల్లడించారు. 15 మంది అనుమానితులను, మరో 12 మంది పాత నేరస్తులను అదుుపలోకి తీసుకున్నట్లు తెలిపారు. దీంతో పాటు 44 ద్విచక్ర వాహనాలు, 15 ఆటోలు, 4 కార్లు, 9 గ్యాస్ సిలిండర్లు, కట్టర్లు స్వాధీనం చేసుకున్నారు.

English summary
DCP ramalaxmi cardon search at uppal chiluka nagar on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X