వాటర్ ట్యాంకులో శవమై తేలిన వివాహిత, కలకలం
హైదరాబాద్: మార్చి మొదటి వారంలో కనిపించకుండా పోయిన ఓ వివాహిత వాటర్ ట్యాంక్‌లో శవమై కనిపించడంతో కలకలం సృష్టించింది. వివరాలిలా ఉన్నాయి. సరూర్ నగర్‌లోని వాటర్ ట్యాంక్ లో ఓ మహిళ శవం ఆదివారం బయటపడింది.
ఆమె వయసు 32 నుంచి 38 మధ్య ఉండొచ్చునని భావిస్తున్నారు. మృతురాలి మెడలో మంగళసూత్రం, గోధుమ రంగు సాక్సులు, పసుపు నైటీ ధరించి ఉంది. మహిళ మరణించి మూడు లేదా నాలుగు రోజులు అయిఉంటుందని భావిస్తున్నారు.

సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎవరైనా ఆమెను హత్య చేసి ట్యాంకులో పడవేశారా? లేక ప్రమాదవ శాత్తూ అందులో పడిపోయిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సు ఉంది.












Click it and Unblock the Notifications