• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్దాల్లా రోడ్లు.. అధికారులకు డెడ్ లైన్; అభివృద్ధి పనులపై కేసీఆర్ ఫోకస్.. దూకుడు పెంచినట్టేనా!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అభివృద్ధి పనుల పై ఫోకస్ చేస్తున్నారా? రాష్ట్రంలో పరిష్కారం కాని అనేక సమస్యలపై అనేక విషయాలపై వరుస సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను, ప్రజాప్రతినిధులను పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారా? వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే కెసిఆర్ దూకుడుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి సిద్ధమయ్యారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

వచ్చే ఎన్నికలే లక్ష్యంగా కేసీఆర్ అడుగులు

వచ్చే ఎన్నికలే లక్ష్యంగా కేసీఆర్ అడుగులు


వచ్చే ఎన్నికలను ఇప్పటి నుంచే సీఎం కేసీఆర్ సీరియస్ గా తీసుకుంటున్నారు. మూడో సారి మళ్ళీ అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజా క్షేత్రంలో ప్రజల సమస్యలు పరిష్కరించడం పైన, ప్రజల మద్దతు కూడగట్టడం పైన పూర్తిగా దృష్టి సారించాలని నిర్ణయించిన కేసీఆర్, ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు, నిత్యం ప్రజల్లో ఉండాలి అంటూ దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటనలు చేయాలని, ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

రోడ్ల మరమ్మత్తు పనులపై కేసీఆర్ ఫోకస్

రోడ్ల మరమ్మత్తు పనులపై కేసీఆర్ ఫోకస్

ఇక అంతే కాకుండా తాను కూడా అధికారులను పరుగులు పెట్టించే పని మొదలుపెట్టారు ఈ క్రమంలో ప్రగతిభవన్లో రాష్ట్ర కేబినెట్ మంత్రులు, రోడ్లు భవనాలు పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన కేసిఆర్ రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మరమ్మతు పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోడ్ల మరమ్మతు పనులకు సంబంధించి డెడ్లైన్ విధించారు.

డిసెంబర్ రెండో వారంలోగా రోడ్ల మరమ్మత్తుపనులు పూర్తి చెయ్యాలని డెడ్ లైన్

డిసెంబర్ రెండో వారంలోగా రోడ్ల మరమ్మత్తుపనులు పూర్తి చెయ్యాలని డెడ్ లైన్

ముఖ్యమంత్రి కెసిఆర్అధ్యక్షతన, రోడ్లు భవనాలు మరియు పంచాయతీ రాజ్ శాఖల మంత్రులు, అధికారులతో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో రాష్ట్రం లో రోడ్ల పరిస్థితి పైన, రోడ్లను ఎప్పటికీ చెక్కు చెదరకుండాఉంచేందుకు చేపట్టవలసిన చర్యలు, పాడయిన రోడ్లను ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేయడం తదితర కార్యాచరణ పై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. వచ్చే నెల రెండో వారంలోగా రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మరమ్మతు పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. ఇక క్షేత్రస్థాయి ఇంజనీర్ల దగ్గర రోడ్ లు ఎక్కడెక్కడ ఏ ఏ మూలలో పాడయ్యాయో సంబంధించిన అన్ని వివరాలు ఉండాలని కేసీఆర్ సూచించారు.

రోడ్లు అద్దాల మాదిరిగా ఉంచే బాధ్యత ఈ శాఖల వారిదే

రోడ్లు అద్దాల మాదిరిగా ఉంచే బాధ్యత ఈ శాఖల వారిదే

చెక్కుచెదరకుండా అద్దాల మాదిరిగా రోడ్లను ఉంచేందుకు బాధ్యత రోడ్లు మరియు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులదని కెసిఆర్ సూచించారు. ఈ దిశగా ఆయా శాఖల పరిపాలనా సంస్కరణలు అమలు చేయాలని కేసీఆర్ తెలిపారు. ఇక ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ శాఖలను బలోపేతం చేయడం పైన కూడా కెసిఆర్ మాట్లాడారు. ఆయా శాఖలలో పెరుగుతున్న పనిని బట్టి ప్రతిభావంతంగా పర్యవేక్షణ చేయడానికి పని విభజన జరగాలని పేర్కొన్న ముఖ్యమంత్రి దీనికి సంబంధించి ఒక ప్లాన్ ను, అవసరమైన సిబ్బందిని నియమించుకోవడాన్ని అధికారులు సమీక్షించుకుని ప్రభుత్వానికి తుది నివేదిక ఇస్తే వచ్చే క్యాబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదించే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు.

దూకుడుగా పనులపై ఫోకస్ చేస్తున్న గులాబీ బాస్ .. ఇప్పటినుండే వ్యూహాత్మక అడుగులు

దూకుడుగా పనులపై ఫోకస్ చేస్తున్న గులాబీ బాస్ .. ఇప్పటినుండే వ్యూహాత్మక అడుగులు


రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖలను పటిష్టం చేయడానికి అనేక మార్గాలు అనుసరించాల్సి ఉందని అభిప్రాయపడిన సీఎం కేసీఆర్ తదనుగుణంగా ప్రభుత్వ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం అధికారులు కష్టపడాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తున్న కేసీఆర్ వారికి డెడ్ లైన్ కూడా విధించి పనులలో వేగం పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి సీఎం కేసీఆర్ ప్రజల అవసరాలను తీర్చి, వచ్చే ఎన్నికల లక్ష్యంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని ఇటీవల కాలంలో ఆయన చర్యల ద్వారా అందరికీ అర్థమయ్యేలా చేస్తున్నారు.

English summary
Telangana Chief Minister KCR is focusing on development work in the state. As part of that, the officials were ordered to complete the road repair works in the state by the second week of December
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X