అనంతగిరి అడవుల్లో జంట ఆత్మహత్య.. కుళ్లిపోయి,భయానక స్థితిలో మృతదేహాలు..

వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి అడవుల్లో జంట మృతదేహాలు కలకలం రేపాయి. చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో ఉన్న రెండు మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయి ఎముకలు తేలి కనిపిస్తున్నాయి. ఆత్మహత్య చేసుకుని దాదాపు నెల రోజులకు పైనే కావచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

మృతదేహాలకు సమీపంలోనే పోలీసులు ఓ బైక్‌ను గుర్తించారు. బైక్ నంబర్ TS 34 C 1952 ఆధారంగా దర్యాప్తు చేపట్టగా మృతుల వివరాలు తెలియవచ్చాయి. మృతులను కోట్‌పల్లి గ్రామానికి చెందిన శివలీల, మహేందర్‌గా జిల్లా ఎస్పీ నారాయణ తెలిపారు. ఇరువురికి ఇదివరకే వేరే వారితో వివాహం జరిగిందన్నారు. ఘటన స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదన్నారు. కొద్ది రోజుల క్రితం శివలీల కనిపించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

Decomposing bodies of a couple found hanging on a tree in ananthagiri forest

ఇద్దరు ప్రేమలో ఉండటం వల్లే కలిసి ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు. అయితే ఈ ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారా.. లేక ఎవరైనా ఇక్కడికి తీసుకొచ్చి హత్య చేశారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టమ్‌కి తరలించినట్టు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసినట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+