అల్లుడి కోసం రంగంలోకి మామ, అగ్రనేత రిజెక్ట్ - ఏం జరుగుతోంది..!!
అల్లు అర్జున్ ఎపిసోడ్ ఊహించని మలుపులు తిరుగుతోంది. అల్లు అర్జున్ వ్యవహారం సినీ - రాజకీ య వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ వ్యవహారానికి కొనసాగింపుగా తెలంగాణలో బెనిఫిట్ షో.. టికెట్ ధరల పెంపు ఉండదని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయంలో సీఎం రేవంత్ ఆగ్రహంగా ఉన్నారు. దీంతో, అల్లు అర్జున్ మామ ప్రస్తుత కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర రెడ్డి రంగంలోకి దిగారు. కానీ, కాంగ్రెస్ అగ్ర నేత నుంచి తిరస్కారం తప్పలేదు. దీంతో, శేఖర్ రెడ్డి ఏం చేయబోతున్నారనేది కీలకంగా మారుతోంది.
శేఖర్ రెడ్డి ప్రయత్నం
అల్లు అర్జున్ పైన కేసు కొనసాగుతోంది. అల్లు అర్జున్ తాజా మీడియా సమావేశం కారణంతో అతని కండీషనల్ బెయిల్ రద్దు కోరుతూ పోలీసులు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. దీంతో, అల్లు అర్జున్ కోసం పలువురు రంగంలోకి దిగారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న అల్లు అర్జున్ మామ కంచర్ల శేఖర్ రెడ్డి తన వంతు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ రోజు (సోమవారం) గాంధీ భవన్ లో శేఖర్ రెడ్డి ఏఐసీసీ రాష్ట్ర ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీ తో కలిసే ప్రయత్నం చేసారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఎపిసోడ్ పైనే చర్చిస్తారని భావించిన దీపా దాస్ మున్షీ ఈ వివాదంలో జోక్యం చేసుకునేందుకు ఆసక్త చూపించలేదని పార్టీ వర్గాల సమాచారం.

కలిసేందుకు నిరాకరణ
దీంతో, దీపాదాస్ మున్షీ తనను కలిసేందుకు వచ్చిన శేఖర్ రెడ్డిని కలవలేదు. కొద్ది సేపు నిరీక్షించి న తరువాత శేఖర్ రెడ్డి గాంధీ భవన్ నుంచి వెళ్లిపోయారు. గతంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన శేఖర్ రెడ్డి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరారు. 2023 ఎన్నికల్లో సీటు కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నం చేసారు. శేఖర్ రెడ్డికి సీటు ఇస్తే అల్లు అర్జున్ ప్రచారం చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ, శేఖర్ రెడ్డికి సీటు రాలేదు. అల్లు అర్జున్ అరెస్ట్ తరువాత శేఖర్ రెడ్డి మనస్థాపానికి గురై పార్టీకి రాజీనామా చేస్తారనే ప్రచారం తెర మీదకు వచ్చింది. ఇక, ఇప్పుడు ఈ వివాదం ముదరటంతో దీపాదాస్ మున్షీని కలిసేందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్ వ్యాఖ్యలతో
రేవంత్ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవటం.. రేవంత్ వ్యాఖ్యల తరువాత అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ తో మంత్రులు ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. బాధిత కుటుంబానికి 20 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసారు. సంధ్యా థియేటర్ లో అల్లు అర్జున్ పైన పోలీసులు వీడియో విడుదల చేసారు. ఇక, వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో దీపాదాస్ మున్షీ ఇప్పుడు శేఖర్ రెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వటం ద్వారా కొత్త విమర్శలకు ఆస్కారం ఇచ్చినట్లుగా భావించారని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో, అల్లు అర్జున్ ఎపిసోడ్ లో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications