ఏదైనా సాధ్యమే: ‘దీప్‌శిఖా’ మహిళా క్లబ్ స్వర్ణోత్సవంలో కవిత(పిక్చర్స్)
హైదరాబాద్: పురాణాల్లో మహిళలను శక్తి స్వరూపులుగా కొలిచారని, మహిళలు తలుచుకుంటే సాధించలేనిదంటూ ఉండదని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. దీప్‌శిఖ మహిళా క్లబ్ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమం సోమాజిగూడలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో అట్టహాసంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మొదటి మహిళ, గవర్నర్ సతీమణి విమలానరసింహన్, ఎంపీ కవిత హాజరయ్యారు. నూతన అధ్యక్షురాలు అనితాసోని, కార్యవర్గ సభ్యులు మాధవి అగర్వాల్, నిధి లకోటియా, ఉమా బాల్దా, బబితా, అరేనా అరేహానా మలానీ, శోభాభన్సల్, అంజూసంఘీ, అనితాగోయల్ చేత ప్రమాణం చేయించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. పలుదేశాల్లో మహిళలపై ఎన్నో ఆంక్షలు ఉన్నాయని, పురుషులతో సమానంగా ముందుకు వెళ్లలేని పరిస్థితులున్నాయని అన్నారు. కానీ, మనదేశంలో మహిళలకు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్య్రాలున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరముందన్నారు.
గవర్నర్ సతీమణి విమలానరసింహన్ మాట్లాడుతూ.. మహిళలకు విద్య తప్పనిసరి అని అన్నారు. ఏ ఇంట్లో మహిళ చదువుకుంటుందో ఆ కుటుంబమంతా అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. విద్యకు అత్యంత ప్రాధాన్యతనివ్వాల అన్నారు.

‘దీప్‌శిఖా' మహిళా క్లబ్ స్వర్ణోత్సవం
పురాణాల్లో మహిళలను శక్తి స్వరూపులుగా కొలిచారని, మహిళలు తలుచుకుంటే సాధించలేనిదంటూ ఉండదని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.

‘దీప్‌శిఖా' మహిళా క్లబ్ స్వర్ణోత్సవం
దీప్‌శిఖా మహిళా క్లబ్ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమం సోమాజిగూడలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో అట్టహాసంగా జరిగింది.

‘దీప్‌శిఖా' మహిళా క్లబ్ స్వర్ణోత్సవం
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మొదటి మహిళ, గవర్నర్ సతీమణి విమలానరసింహన్, ఎంపీ కవిత హాజరయ్యారు.

‘దీప్‌శిఖా' మహిళా క్లబ్ స్వర్ణోత్సవం
నూతన అధ్యక్షురాలు అనితాసోని, కార్యవర్గ సభ్యులు మాధవి అగర్వాల్, నిధి లకోటియా, ఉమా బాల్దా, బబితా, అరేనా అరేహానా మలానీ, శోభాభన్సల్, అంజూసంఘీ, అనితాగోయల్ చేత ప్రమాణం చేయించారు.

‘దీప్‌శిఖా' మహిళా క్లబ్ స్వర్ణోత్సవం
ఎంపి కవిత మాట్లాడుతూ.. పలుదేశాల్లో మహిళలపై ఎన్నో ఆంక్షలు ఉన్నాయని, పురుషులతో సమానంగా ముందుకు వెళ్లలేని పరిస్థితులున్నాయని అన్నారు. కానీ, మనదేశంలో మహిళలకు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్య్రాలున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరముందన్నారు.

‘దీప్‌శిఖా' మహిళా క్లబ్ స్వర్ణోత్సవం
గవర్నర్ సతీమణి విమలానరసింహన్ మాట్లాడుతూ.. మహిళలకు విద్య తప్పనిసరి అని అన్నారు.

‘దీప్‌శిఖా' మహిళా క్లబ్ స్వర్ణోత్సవం
ఏ ఇంట్లో మహిళ చదువుకుంటుందో ఆ కుటుంబమంతా అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. విద్యకు అత్యంత ప్రాధాన్యతనివ్వాల అన్నారు.












Click it and Unblock the Notifications